Begin typing your search above and press return to search.

ట్రంప్ తో యూట్యూబ్ డీల్... ఎన్ని వందల కోట్లంటే..!

జనవరి 6న యూఎస్ కాపిటల్‌ పై జరిగిన దాడి నేపథ్యంలో వీడియో ప్లాట్‌ ఫామ్ యూట్యూబ్ తన ఖాతాను సస్పెండ్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే

By:  Raja Ch   |   1 Oct 2025 9:50 AM IST
ట్రంప్  తో యూట్యూబ్  డీల్... ఎన్ని వందల కోట్లంటే..!
X

జనవరి 6న యూఎస్ కాపిటల్‌ పై జరిగిన దాడి నేపథ్యంలో వీడియో ప్లాట్‌ ఫామ్ యూట్యూబ్ తన ఖాతాను సస్పెండ్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా ఆ దావాను పరిష్కరించడానికి యూట్యూబ్ 24.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.217.64 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.

అవును... తన అకౌంట్ ను బ్యాన్ చేసిందని ట్రంప్ యూట్యూబ్ పై కేసు వేసిన నేపథ్యంలో.. 24.5 మిలియన్ డాలర్లకు యూట్యూబ్ సెటిల్ మెంట్ చేసుకుంది! ఈ మొత్తంలో 22 మిలియన్ డాలర్లు.. వైట్ హౌస్‌ లో కొత్త బాల్‌ రూమ్ నిర్మించడానికి $200 మిలియన్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేషనల్ మాల్ ట్రస్టుకు చెల్లిచనుంది.

మిగిలిన 2.5 మిలియన్ డాలర్లు ఇతర సంస్థలకు చెల్లించనుంది. డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను సస్పెండ్ చేసినందుకు సోషల్ మీడియా సైట్‌ లు ఎక్స్/ట్విట్టర్, ఫేస్‌ బుక్ కూడా ఆయనకు డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన తర్వాత వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం మాతృ సంస్థ ఆల్ఫాబెట్ నుండి ఈ పరిష్కారం వచ్చింది.

కాగా... జనవరిలో ఫేస్‌ బుక్ మాతృ సంస్థ మెటా 25 మిలియన్ డాలర్ల పరిష్కారానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో 22 మిలియన్ డాలర్లను ట్రంప్ అధ్యక్ష లైబ్రరీకి కేటాయించారు. తర్వాత ఎలాన్ మస్క్ 'ఎక్స్’ సంస్థ 10 మిలియన్ డాలర్లు చెల్లించింది. అప్పటి నుండి ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలు అన్నీ పునరుద్ధరించబడ్డాయి.