Begin typing your search above and press return to search.

మోడీకి బిగ్ ఫ్యాన్ ని నేనే సుమా...ట్రంప్ ప్రేమావేశం !

ఇదే సందర్భంగా ట్రంప్ భారత ప్రధాని మోదీ పట్ల తనకు ఉన్న వ్యక్తిగత అభిమానాన్ని ఫుల్ క్లారిటీతో చెప్పారు.

By:  Satya P   |   25 May 2026 9:03 AM IST
మోడీకి బిగ్ ఫ్యాన్ ని నేనే సుమా...ట్రంప్ ప్రేమావేశం !
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి అది మనసులో ఉబికి పుట్టుకుని వచ్చిన పరవశమా లేక వ్యూహాత్మకమా అన్నది పక్కన పెడితే ఐ లవ్ ఇండియా అన్నారు, ఐ లవ్ మోడీ అని కూడా అన్నారు. నాకు భారతదేశం, ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ఆదివారం న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా 250 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌కు ఆకస్మికంగా ఫోన్ చేసి భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన మద్దతును ఉద్వేగభరితంగా తెలియచేస్తూ షాక్ ఇచ్చేశారు.

మోడీకి ఫ్యాన్ నేనే :

ఇదే సందర్భంగా ట్రంప్ భారత ప్రధాని మోదీ పట్ల తనకు ఉన్న వ్యక్తిగత అభిమానాన్ని ఫుల్ క్లారిటీతో చెప్పారు. తాను ప్రధానమంత్రి మోదీకి పెద్ద అభిమానిని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గోర్, దౌత్యవేత్తలు, అధికారులు వ్యాపార నాయకులతో కిక్కిరిసిన జనల ముందు ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశారు.గోర్ ఆ కాల్‌ను స్పీకర్‌ ఫోన్‌లో పెట్టారు. ఆ మీదట ట్రంప్ అన్న ప్రతీ మాటను అక్కడి జనాలు ఆహూతులు అతిధులు అంతా విన్నారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని మోదీని ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. తాను భారతదేశాన్ని ప్రధానమంత్రి మోదీని ప్రేమిస్తున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలకు హాజరైన వారి నుండి పెద్ద ఎత్తున చప్పట్లు కురిసాయి. ఇదే కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కూడా ట్రంప్ ప్రశంసించడ విశేషం.

భారత్ కి ఏమైనా ఇస్తాం :

అమెరికా దేశంగా తాము అద్భుతంగా రాణిస్తున్నామని, తాము రికార్డులను సృష్టిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో ఉందని కూడా అన్నారు. అలాగే అమెరికా స్టాక్ మార్కెట్ సైతం రికార్డు స్థాయిలో ఉందని అన్నారు. ఈ రోజున భారతదేశం పొందాలనుకునే ఏ వస్తువునైనా తాము వెంటనే సమకూర్చగలమని ట్రంప్ ఒక హామీ ఇచ్చేశారు. ఇక మీదట భారతదేశం తన మీద నూరు శాతం ఆధారపడవచ్చు అని కూడా ట్రంప్ భరోసా ఇచ్చారు. భారత్ కి ఎప్పుడైనా సహాయం అవసరమైతే ఎవరిని సంప్రదించాలో వారికి బాగా తెలుసు అని కూడా అన్నారు. వారు నేరుగా ఇక్కడికే ఫోన్ చేస్తారని కూడా ట్రంప్ అమెరికా రాయబారి గోర్ తో మాట్లాడిన సంభాషణలో చెప్పడం విశేషం.

నా మిత్రుడు మోడీ :

ఇదిలా ఉంటే ఇదే మీటింగులో మాట్లాడిన భారత్ లో అమెరికా రాయబారి గోర్ ప్రతిసారీ అధ్యక్షుడు ట్రంప్ తనతో మాట్లాడినప్పుడు అడిగే మొదటి ప్రశ్నలలో ఒకటి ఏంటంటే నా మిత్రుడు ప్రధానమంత్రి మోదీ ఎలా ఉన్నారు అన్నది అని చెప్పారు. ఇపుడు ఈ విషయాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం అని కూడా గోరీ అన్నారు. ఎందుకంటే ఈ సంబంధం కొత్తది కాదు కాబట్టి అని ఆయన చెప్పారు. అలా ట్రంప్-ప్రధాని మోదీ బంధాన్ని సెర్గియో గోర్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ట్రంప్, ప్రధాని మోదీల నాయకత్వంలో భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలపడుతోందని అమెరికా రాయబారి గోర్ చెప్పడం విశేషం. మొత్తానికి ఐ లవ్ యూ ఇండియా ఐ లవ్ మోడీ అంటూ ట్రంప్ చేసిన ఈ బిగ్ సౌండ్ ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.