Begin typing your search above and press return to search.

ఏం హాలత్ రా బై.. అందరినీ భయపెట్టే ట్రంప్ కూ.. భార్య పోరు తప్పలేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మధ్య హెలికాప్టర్‌లో జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది.

By:  A.N.Kumar   |   27 Sept 2025 4:00 PM IST
ఏం హాలత్ రా బై.. అందరినీ భయపెట్టే ట్రంప్ కూ.. భార్య పోరు తప్పలేదు
X

పెళ్లంటే నూరెళ్ల మంట అని కొందరు కవులు పాటలు రాశారు. పాడారు. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఎక్కడైనా మంటలాగానే ఉంది. పెళ్లి అయిన కొత్తల్లోనే భర్తలను కాటికి పంపిస్తున్న మహిళా మణుల వార్తలు రోజుకొకటి వస్తున్నాయి. సామాన్యుడికి సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ వరకూ భార్యలను భరించలేక వదిలేస్తున్న వారు ఎందరో.. ప్రపంచం మొత్తాన్ని తన టారిఫ్ లతో భయపెడుతూ నేతలను తన కాళ్ల వద్దకు రప్పించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా భార్య పోరు తప్పలేదంటే అతిశయోక్తి కాదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మధ్య హెలికాప్టర్‌లో జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లలో వివిధ రకాల చర్చలు మొదలయ్యాయి. ట్రంప్‌–మెలానియా గొడవ అని, లేక కేవలం వాతావరణ అసౌకర్యం కారణంగా వచ్చిన ఆవేశం మాత్రమే అని వివిధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వీడియో నేపథ్యం

ట్రంప్ దంపతులు ఐక్యరాజ్యసమితి (UN) అసెంబ్లీ జనరల్ సమావేశాలకు హాజరయ్యాక, మెరైన్ వన్ హెలికాప్టర్‌లో తిరుగుపయన సమయంలో ఈ సంభాషణ జరిగింది. వీడియోలో ట్రంప్ మెలానియా వైపు వేలు చూపిస్తూ ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు. అయితే, లిప్ రీడింగ్ నిపుణుల వివరాల ప్రకారం, ఈ సంభాషణ ఎస్కలేటర్ ఆగిపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేసే క్రమంలో జరిగింది.

నిపుణులు వెల్లడించిన సంభాషణలో ట్రంప్ ఇలా అన్నారని అంటున్నారు.

"నేను వారిని క్షమించలేను. వాళ్లు నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నించారు." అని ట్రంప్ అనగా.. మెలానియా "మనకు ఇది చేయలేం. మనం సురక్షితంగా ఉండాలి. మీరు సేఫ్‌గా లేరు."అంటూ వాదించిందట.. ట్రంప్ దీనికి "వాళ్లు అయిపోయారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే." అంటూ హామీనిచ్చాడట..

ఈ వ్యాఖ్యల ఆధారంగా, ట్రంప్ - మెలానియా మధ్య ఘర్షణ లేదని, కేవలం పరిస్థితి వల్ల ఏర్పడిన ఉత్కంఠకరమైన సంభాషణ మాత్రమే జరిగిందని నిపుణులు అంటున్నారు.

సామాజిక మాధ్యమ ప్రభావం

వీడియోలో ట్రంప్ మెలానియా వైపు వేలు చూపడం, ఆవేశపూరితంగా మాట్లాడటం నెట్టింట పెద్ద చర్చకు కారణమైంది. ఎక్కువ మంది దీనిని ట్రంప్–మెలానియా గొడవగా భావించారు. కానీ వాస్తవానికి, లిప్ రీడింగ్ వివరాలు.. సమీక్షలను పరిశీలిస్తే, ఇది ఒక ‘సమస్య–పరిష్కార’ సంభాషణ మాత్రమే అని చెప్పవచ్చు.

సోషల్ మీడియా లో వైరల్ అయ్యే వీడియోలు తరచుగా అసలు పరిస్థితిని విభిన్నంగా చూపుతాయి. ట్రంప్–మెలానియా సంభాషణ కూడా దీనికి ఉదాహరణ, యథార్థ పరిస్థితి.. నెటిజన్ల అభిప్రాయం మధ్య తేడాను స్పష్టంగా చూపుతుంది.