Begin typing your search above and press return to search.

ఇండియాకు ట్రంప్‌ జూనియర్.. హై సెక్యూరిటీ జోన్ లోకి ఉదయ్ పూర్..

ఈ రాక సాధారణ రాజకీయ పర్యటన కాదు. ఇది పూర్తిగా భిన్నం. భారత–అమెరికన్ కుటుంబం నిర్వహిస్తున్న ఒక భారీ, రాయల్ వెడ్డింగ్.

By:  Tupaki Political Desk   |   19 Nov 2025 8:00 PM IST
ఇండియాకు ట్రంప్‌ జూనియర్.. హై సెక్యూరిటీ జోన్ లోకి ఉదయ్ పూర్..
X

ఒక విదేశీ రాజకీయ నాయకుడు భారతదేశానికి వస్తే అది పెద్ద వార్తే. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది భారీ వర్త.. ఇక ఆయన కుటుంబ సభ్యులు.. భారీనే అయినా కొంచెం తక్కువనే అనుకోవాలి. ట్రంప్ కుమారుడు, వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ ప్రముఖ నేత డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ ఇండియా వస్తున్నాడని తెలిసిన క్షణం నుంచి దేశ వ్యాప్తంగా ఉత్సుకత పెరిగింది. అమెరికా రాజకీయ వాతావరణంలో అతని ప్రభావం, రాబోయే ఎన్నికల్లో ట్రంప్ కుటుంబ రీఎంట్రీ చర్చ, అతని వ్యాపార నెట్‌వర్క్ ఈ నేపథ్యాల్లో అతడి భారత పర్యటన ఒక్కటే పెద్ద సందేశాన్ని ఇస్తోంది.

పూర్తిగా భిన్నమైన పర్యటన..

ఈ రాక సాధారణ రాజకీయ పర్యటన కాదు. ఇది పూర్తిగా భిన్నం. భారత–అమెరికన్ కుటుంబం నిర్వహిస్తున్న ఒక భారీ, రాయల్ వెడ్డింగ్. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రదేశాల్లో ఒకటైన రాజస్థాన్‌ ఉడయ్‌పూర్ ఈ వేడుకకు వేదిక. నవంబర్‌ 21, 22 తేదీల్లో జరగనున్న ఈ పెళ్లికి అమెరికా ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, భారీ నెట్‌వర్క్ ఉన్న అతిథులు హాజరుకానున్నారు.

హై అలర్ట్ లోకి ఉదయ్ పూర్..

ట్రంప్ జూనియర్ ఆగమనం సమాచారం బయటకు రావడమే ఆలస్యం.. రాజస్థాన్‌ భద్రతా విభాగాలు, యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఉదయ్‌పూర్ లోకల్ పోలీస్ అన్నీ హై అలర్ట్ మోడ్‌లోకి వెళ్లాయి. ఎందుకంటే ఇలాంటి అతిథి రాక కేవలం వేడుక కాదు.. అది ఒక అంతర్జాతీయ భద్రతా ఆపరేషన్. ట్రంప్ జూనియర్‌ను ఇండియా వైపు లాగింది అతడి వ్యాపార సంబంధాలు, భారత్‌లోని రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీలు, అతడికి ఉన్న భారతీయ స్నేహితుల నెట్‌వర్క్. రాజస్థాన్ ప్యాలెస్‌లపై ట్రంప్ కుటుంబానికి ఉన్న ఆకర్షణ కూడా మరో కారణం. లీలా ప్యాలెస్ వంటి లగ్జరీ ప్రదేశాల్లో అతడి బస ముందుగానే బుక్ అయ్యింది.

ఉదయ్‌పూర్, ప్రపంచ ప్రసిద్ధ డెస్టినేషన్ వెడ్డింగ్ నగరం. ప్రియాంకా చోప్రా–నిక్ జోనాస్ వివాహం తర్వాత ఈ నగరం గ్లోబల్ మ్యాప్‌పై మరోసారి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ట్రంప్ జూనియర్‌ రాకతో మరింత ప్రాధాన్యం సంపాదించుకుంది. ఈ వేడుక ఒక్క పెళ్లి మాత్రమే కాదు, ఇది బిజినెస్, సాంస్కృతిక దౌత్యం, అంతర్జాతీయ నెట్‌వర్క్ అన్నింటికీ ఇదే వేధిక అని అమెరికా అధికారులు అన్నారు.

ఉదయ్ పూర్ ను స్కాన్ చేస్తున్న యూఎస్ భద్రతా బలగాలు..

యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఇప్పటికే ఉదయ్‌పూర్‌ను స్కాన్ చేసి భద్రతా అనుమతి ఇచ్చింది. 200కు పైగా పోలీసులు, ప్రత్యేక కమాండోలు, ఇంటెలిజెన్స్ యూనిట్లు, డ్రోన్ పర్యవేక్షణ ఇవన్నీ ప్రోటోకాల్‌లో ఉన్నాయి. హోటల్ జోన్ తాత్కాలికంగా సెక్యూర్ జోన్‌ లోకి వెళ్లింది. ఈ పర్యటనలో రాజకీయ అర్థాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో 2026 ఎన్నికల వేడి మొదలైపోయింది. ట్రంప్ కుటుంబం మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఇండియా–అమెరికా వలస జనాభా, డయాస్పొరా ప్రభావం, రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు అన్నీ ఈ సందర్శనకు కొత్త అర్థం ఇస్తున్నాయి.

పెళ్లి మాత్రమే కాదు.. తర్వాత ఎన్నో..

ఇండియాకు కూడా ఇది సాధారణ పర్యటన కాదు. అమెరికా టాప్ వ్యాపార వర్గాలతో నేరుగా కనెక్షన్లు, ఉదయ్‌పూర్ టూరిజానికి భారీ బ్రాండింగ్, భవిష్యత్‌లో ట్రంప్ ఆర్గనైజేషన్‌తో కొత్త వ్యాపార అవకాశాలు, వరల్డ్ మీడియాలో ఇండియాపై దృష్టి ఈ పర్యటన ద్వారా ఇవన్నీ లభించనున్నాయి. ఒక పెళ్లి.. కానీ ప్రభావం మాత్రం రెండు దేశాల రాజకీయాలు, బిజినెస్, దౌత్యంపై. డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ రాక కేవలం వ్యక్తిగత అతిథి పర్యటన కాదు… ఇది ఒక సాఫ్ట్ పవర్ మూమెంట్. ఈ సందర్శన చెప్పే పెద్ద సందేశం ఒక్కటే.. ప్రపంచ స్థాయి రాజకీయ కుటుంబాలు కూడా ఇప్పుడు ఇండియాను కేవలం మార్కెట్‌గా కాదు, గ్లోబల్ కనెక్షన్ల కేంద్రంగా చూస్తున్నాయి.