Begin typing your search above and press return to search.

ట్రంప్ కి భారీ షాక్-ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా

ఆయన స్వయంగా నియమించిన కీలక గూఢచారి అధికారి అలాగే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఎన్సీటీసీ డైరెక్టర్ అయిన జో కెంట్ మంగళవారం తన పదవులకు రాజీనామా చేశారు.

By:  Satya P   |   17 March 2026 11:26 PM IST
ట్రంప్ కి భారీ షాక్-ఇంటెలిజెన్స్ చీఫ్  రాజీనామా
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. ఆయన స్వయంగా నియమించిన కీలక గూఢచారి అధికారి అలాగే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఎన్సీటీసీ డైరెక్టర్ అయిన జో కెంట్ మంగళవారం తన పదవులకు రాజీనామా చేశారు. ఆయన ట్రంప్ వైఖరి మీద తీవ్ర అసంతృప్తితో ఈ విధంగా చేశారు అని అంటున్నారు. ఇక ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి తన తీవ్ర వ్యతిరేకతను ఈ విధంగా తెలియచేస్తూ జో కెంట్ రాజీనామా చేశారని అంటున్నారు.

మద్దతు ఇవ్వలేనంటూ :

అసలు ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎందుకు వెళ్తోంది అన్నది తనకు అర్ధం కాదని జో కెంట్ అంటున్నారు. నిజానికి చూస్తే ఇరాన్ వల్ల అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ లేదని ఆయన వాదిస్తూ వస్తున్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణకు గల కారణాలను ఆయన నేరుగా ట్రంప్ తోనే సవాల్ చేసారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా ప్రకటన చేశారు అని అంటున్నారు. ఇది ఇపుడు అమెరికాలో తీవ్రమైన రాజకీయ ప్రకంపనలు సృష్టింస్తోంది.

ఇదే కారణమంటూ :

ఇక జో కెంట్ రాజీనామాకు కారణం ఇదే అని అంటున్నారు. ఇజ్రాయెల్ అమెరికాలోని దాని లాబీ ఒత్తిడి కారణంగానే ఇరాన్ యుద్ధం ప్రారంభమైందని తాను నమ్ముతున్నట్లుగా జో కెంట్ చెబుతున్నారు. అందుకే ఈ యుద్ధానికి తన మనస్సాక్షికి విరుద్ధంగా తాను ఏ విధంగానూ మద్దతు ఇవ్వలేనని జో కెంట్ స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జో కెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక లేఖలో చాలా విషయాలను ప్రస్తావించారు ఇరాన్ నుండి అమెరికాకు ముప్పుకు సంబంధించిన నిఘా సమాచారాన్ని సైతం తారుమారు చేశారని ఆయన పేర్కొనడం విశేషం ఇరాన్ తక్షణ ముప్పును కలిగించడం లేదని అది అవాస్తవం అని కూడా జో కెంట్ పేర్కొన్నారు. మరి జో కెంట్ చెప్పినది చూస్తే ఇది వైట్ హౌస్ అధికారిక కథనానికి విరుద్ధంగా ఉందని అంటున్నారు. ఇరాన్ తో ప్రపంచానికి అమెరికాకు ముప్పు అని చెబుతూనే ట్రంప్ యుద్ధానికి తెర తీశారు అంటున్నారు.

ఏడు నెలలలోనే రాజీనామా :

ఇక చూస్తే కనుక ట్రంప్ ఎంతో నమ్మకంగా జో కెంట్ ని తెచ్చి యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. ఈ నియామకం 2025 జూలైలో జరిగింది. ఆనాడు జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రానికి జో కెంట్ ని నాయకత్వం వహించమని కోరారు. అలాగే కీలక పదవిని కట్టబెట్టారు. అంతకు ముందు జో కెంట్ గ్రీన్ బెరెట్ యు సిఐఏ అధికారిగా పనిచేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో మొదలైన ఇరాన్ తో అమెరికా యుద్ధం పట్ల జో కెంట్ మొదటి నుంచి విముఖంగా ఉన్నారని అంటున్నారు. తాజాగా ఆయన రాజీనామా చేసి తప్పుకోవడంతో ట్రంప్ పరిపాలనలో రాజీనామా చేసిన అత్యున్నత స్థాయి అధికారిగా జో కెంట్ నిలిచారు. అంతే కాదు ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేయడం మీద వైట్ హౌస్ పాలనా విభాగంలో ఉన్న తీవ్ర అంతర్గత విభేదాలను సైతం ఈ రాజీనామా బయటపెడుతోంది అని అంటున్నారు.

దేవుడు అమెరికాను దీవించుగాక :

ఇక ట్రంప్ మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా 2016లో గెలిచారు. ఆనాడు ట్రంప్ విదేశాంగ విధానం ఏదైతే ఉందో దానికి తాను ఇప్పటికీ మద్దతుగా ఉన్నాను అని జో కెంట్ చెప్పడం విశేషం. ఇక చాలా ఆలోచించిన తర్వాతనే తాను జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ పదవికి ఈ రోజు నుండి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ట్రంప్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఇజ్రాయెల్ దాని శక్తివంతమైన అమెరికన్ లాబీ ఒత్తిడి కారణంగానే అమెరికా ప్రారంభించింది అన్నది స్పష్టమని జో కెంట్ కుండబద్ధలు కొట్టారు.