Begin typing your search above and press return to search.

ఇంకో 6 నెలలే? ట్రంప్ ఆరోగ్యం షాకింగ్ నిజం వెలుగులోకి..

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక టిక్‌టాక్ వీడియోలో ట్రంప్ కేవలం ఆరు నుండి ఎనిమిది నెలలే బతుకుతారనే వాదన వినిపిస్తోంది.

By:  A.N.Kumar   |   26 Aug 2025 5:06 PM IST
ఇంకో 6 నెలలే? ట్రంప్ ఆరోగ్యం షాకింగ్ నిజం వెలుగులోకి..
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక టిక్‌టాక్ వీడియోలో ట్రంప్ కేవలం ఆరు నుండి ఎనిమిది నెలలే బతుకుతారనే వాదన వినిపిస్తోంది. ఎపిస్టెమిక్ క్రైసిస్ అనే ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియోలో, తనను డాక్టరేట్ పొందిన హోమ్ హెల్త్ ఫిజికల్ థెరపిస్ట్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి, ట్రంప్‌కి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (హృద్రోగ సమస్య), క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉన్నాయని పేర్కొన్నాడు.

ఆ వ్యక్తి మాట్లాడుతూ “ట్రంప్ పాదాలు, చీలమండలలో వాపు దీనికి సంకేతం. వాపు పెరుగుతున్నందునే ఆయన ఎక్కువగా సభల్లో డెస్క్ వెనుక కూర్చుంటున్నారు. ఈ సంకేతాలు చూస్తుంటే ఆయన ఇంకో ఆరు నుండి ఎనిమిది నెలలు మాత్రమే జీవించే అవకాశం ఉంది” అని అన్నాడు.

ఇక, ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో సమావేశమైనప్పుడు ట్రంప్ చేతులపై గాయాలున్న ఫోటోలు బయటకు రావడం, ఆయన ఆరోగ్యం మీద అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. గతంలో ఈ గాయాలను మేకప్‌తో దాచారని కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

అయితే, ఈ ఊహాగానాలన్నింటిని వైట్ హౌస్ ఖండించింది. “అధ్యక్షుడు ట్రంప్ ప్రజల మనిషి. ఆయన ప్రతిరోజూ వేలాది మందిని కలుస్తున్నారు, వారితో కరచాలనం చేస్తున్నారు. ఆయన నిబద్ధత, శక్తి ప్రతి రోజు రుజువవుతోంది. ఇలాంటి వదంతులు పూర్తిగా అబద్ధం” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.

మొత్తానికి, సోషల్ మీడియాలో ట్రంప్ ఆరోగ్యంపై వినిపిస్తున్న వాదనలకు అధికారికంగా ఎలాంటి ఆధారం లేదు. వైట్ హౌస్ మాత్రం వాటిని కట్టుకథలేనని తేల్చిచెప్పింది.