Begin typing your search above and press return to search.

ఈసారి యూరోప్ దేశాల వంతు.. సుంకం షాకిచ్చిన ట్రంప్

అగ్రరాజ్య అధ్యక్ష కుర్చీలో కూర్చున్న ట్రంప్.. తన తీరుతో పలు సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.

By:  Garuda Media   |   18 Jan 2026 10:16 AM IST
ఈసారి యూరోప్ దేశాల వంతు.. సుంకం షాకిచ్చిన ట్రంప్
X

అగ్రరాజ్య అధ్యక్ష కుర్చీలో కూర్చున్న ట్రంప్.. తన తీరుతో పలు సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సరికొత్త ఉద్రిక్తలకు తెర తీస్తున్న పరిస్థితి. మారాం చేసే చిన్నపిల్లాడు తాను కోరుకున్నది తెచ్చి ఇవ్వకపోతే.. ఆగమాగం చేసే గడుసు పిల్లాడి తీరును గుర్తు చేసేలా ట్రంప్ వైనం ఉంది.

మొన్నటికి మొన్న భారత్.. చైనా.. ఇలా ఆసియా దేశాలతో పాటు.. మరికొన్ని దేశాలపై సుంకాలను విధించిన ట్రంప్ తాజాగా యూరోపియన్ యూనియన్ దేశాల మీదా సుంకాలు విధిస్తున్నట్లుగా ప్రకటించి మరో భారీ సంచలనానికి కేంద్రంగా మారారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ తో కూడిన ఎనిమిది యూరోపియన్ దేశాలకు షాకిచ్చారు.

ఉన్నట్లుండి అంత ఆగ్రహాన్ని ట్రంప్ ప్రదర్శించటానికి కారణమేంటి? అన్న వివరాల్లోకి వెళితే.. అమెరికాలో గ్రీన్ ల్యాండ్ ను కొనేసి.. తమ దేశంలో కలిపి వేసుకోవాలన్న ట్రంప్ ఆలోచనకు అడ్డుగా మారిన దేశాలకు సుంకాల షాకిచ్చారు. ప్రస్తుతం పది శాతం సుంకం షాక్ ఉంటుందని.. అప్పటికి ఈ దేశాలు తన తీరును మార్చుకోకుంటే 2026 జూన్ 1 నుంచి దిగుమతి సుంకాన్ని పాతిక శాతానికి పెంచుతానని పేర్కొనటం గమనార్హం.

తాను డిసైడ్ అయిన గ్రీన్ ల్యాండ్ దేశాన్ని కొనేసే ప్రక్రియ పూర్తి అయ్యే వరకు తాను విధించిన దిగుమతి సుంకాల అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు ట్రంప్. దీనిపై యూరోప్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తన తీరుతో ప్రపంచంలోని పలు దేశాలతో తగువు తెచ్చుకునేలా వ్యవహరిస్తున్న తీరు అగ్రరాజ్యం అమెరికాకు భారీ నష్టమయ్యేలా ట్రంప్ తీరు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే పనిగా సుంకం బెత్తంతో దేశాల్ని దండించటం ద్వారా తాను అనుకున్నది ట్రంప్ సాధిస్తారా? ఒకవేళ సాధించినా.. దాని ఆయువు ఎంత? అన్నది అసలు ప్రశ్న.