లావు అయ్యిందని భార్యను హతమార్చిన భర్త...!
పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య సియా గోయల్ హత్య చేసిందంటూ వస్తున్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
By: Ramesh Palla | 2 July 2026 4:19 PM ISTపుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య సియా గోయల్ హత్య చేసిందంటూ వస్తున్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి భర్తలను చంపడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యింది. అదే ప్రియుడి మోజులో ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు సియా చేసిన పని అందరు అవాకయ్యేలా చేసింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి అయినా పారిపోవచ్చు లేదంటే అతడికే పెళ్లి ఇష్టం లేదని చెప్పవచ్చు. అలా చెప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి చంపడం ఏంటంటూ అంతా కూడా సియా గోయల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంఘటన గురించి ఇంకా చర్చ జరుగుతుండగానే కర్ణాటకలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను భర్త హత్య చేయడం, అందుకు గల కారణం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకలో భార్యను హత్య చేసిన భర్త...
కర్ణాటక రాష్ట్రం ధరవాడ జిల్లా, నవల్‌గుండ్ తాలూకాలోని హనాసి గ్రామంలో ఈ హత్య జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బసవరాజ్ వడ్డార్(35), ప్రియాంక కమలాకర్(29) ల వివాహం 2024లో జరిగింది. పెళ్లి అయిన కొన్ని నెలల నుంచే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదనపు కష్టం కోసం, బంగారం కోసం బసవరాజ్, అతడి కుటుంబ సభ్యులు ప్రియాంకను వేదిస్తూ ఉండేవారట. ఆ విషయాన్ని ప్రియాంక తన కుటుంబ సభ్యులకు చెబుతూనే ఉందట. పెళ్లి అయ్యి నెలలు గడుస్తూ ఉన్నా ప్రెగ్నెన్సీ రాకపోవడంతోనూ బసవరాజ్ కి ప్రియాంకపై కోపం పెరుగుతూ వచ్చింది. మరో వైపు ప్రియాంక గర్భం దాల్చక పోవడంకు కారణం ఆమె ఓవర్ వెయిట్ ఉండటం అని బసవరాజ్ అంటూ ఉండేవాడట. పెళ్లి తర్వాత లావు అయ్యావు అంటూ ప్రియాంకను పదే పదే బసవరాజ్ వేదిస్తూ ఉండేవాడట.
బరువు పెరిగిందని భార్యపై కోపం..
ప్రియాంక శరీర బరువు, ఆమె కుటుంబ విషయం, ఇతర విషయాలను తీసుకు వచ్చి బసవరాజ్ పదే పదే గొడవకు దిగుతూ ఉండేవాడట. సోమవారం సైతం అదే విధంగా గొడవ జరిగిందని, ఆ సమయంలోనే ప్రియాంకను బసవరాజ్ చంపాడు అంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ప్రియాంకను క్రూరంగా బసవరాజ్ హత్య చేశాడు అంటూ తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బసవరాజ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. హత్యకు సంబంధించిన కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
గృహ హింస కేసులో అరెస్ట్...
గృహ హింస, హత్య కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. గతంలోనూ ప్రియాంక, బసవరాజ్ మధ్య గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఆ గొడవల్లోనే ప్రియాంకను బసవరాజ్ చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ సాగే అవకాశం ఉంది. కేవలం బరువు పెరుగుతుందని, గర్భం దాల్చడం లేదని ప్రియాంకను బసవరాజ్ హత్య చేశాడని ప్రియాంక తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. భార్యను హత్య చేసిన కేసులు ఈ మధ్య కాలంలో అరుదుగా నమోదు అవుతున్నాయి. ఎక్కువగా ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేసిన భార్యలను చూశాం. ఇప్పుడు రివర్స్‌లో భార్యను భర్త హత్య చేయడంతో చర్చనీయాంశం అయ్యింది. చిన్న చిన్న విషయాలకు హత్యల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది. ఈ జనరేషన్ క్షణికావేశంలో తప్పులు చేస్తున్నారని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
