Begin typing your search above and press return to search.

ఉప రాష్ట్రపతి పోరు : బీజేపీని డీఎంకే దెబ్బ కొడుతుందా ?

ఇదిలా ఉంటే మొదటిసారిగా బీజేపీని డీఎంకే ఢీ కొట్టబోతోంది అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.

By:  Satya P   |   19 Aug 2025 12:25 AM IST
ఉప రాష్ట్రపతి పోరు : బీజేపీని డీఎంకే దెబ్బ కొడుతుందా ?
X

దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీగా డీఎంకే ఉంది. ద్రవిడ వాదాన్ని నమ్ముకుని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న డీఎంకేకి బీజేపీతో సిధ్దాంతపరంగా వైరం. హిందూత్వ నుంచి హిందీ వరకూ వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయితే బీజేపీ కానీ డీఎంకే కానీ ప్రత్యక్షంగా ఎక్కడా తలపడినది లేదు. తమిళనాట బీజేపీకి పెద్దగా బలం లేదు. ఇక డీఎంకే తమిళనాడు దాటి బయటకు పోటీ చేసిన పార్టీ అయితే కాదు. దాంతో ఈ రెండు పార్టీల పోరాటం పార్లమెంట్ లోనే సాగుతుంది. అలాగే బీజేపీ మీద డీఎంకే నేతలు ఎపుడూ విమర్శలు చేస్తారు. దానికి బీజేపీ నుంచి ధీటు అయిన బదులు వస్తుంది.

తొలిసారి రేసులోకి :

ఇదిలా ఉంటే మొదటిసారిగా బీజేపీని డీఎంకే ఢీ కొట్టబోతోంది అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏరి కోరి మరీ తమిళనాడుకు చెందిన సీపీ రాధాక్రిష్ణన్ ని బీజేపీ ఎంపిక చేసింది. ఎన్డీయే అభ్యర్ధిగా ఆయన పోటీకి దిగుతున్నారు. ఆయన పూర్వాశ్రమంలో ఫక్తు బీజేపీ వారు. అయితే ఇపుడు మహారాష్ట్ర నుంచి గవర్నర్ గా ఉన్నారు తాయన తమిళనాడుకు చెందిన వారు కాబట్టే బీజేపీ పెద్ద ప్లాన్ తోనే ఆయనను ఎంపిక చేసింది అని అంటున్నారు. బీజేపీకి తమిళనాడులో బలం పెంచుకోవడం అవసరంగా ఉంది. దానికి ఈ ఎంపిక ఒక విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించిన మీదటనే ఇలా చేసింది అని అంటున్నారు. దీంతో బీజేపీతో పోరుకి తొలిసారి డీఎంకే రంగంలోకి దిగుతోంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

తిరుచి శివనే అభ్యర్ధిగా :

డీఎంకేకి చెందిన రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దించబోతున్నారు అని అంటున్నారు. ఆయన పేరుని దాదాపుగా ఇండియా కూటమి ఆమోదించింది అని అంటున్నారు. ఆయన అభ్యర్థి అయితే తమకు ఎండీయేని బీజేపీని కాసుకోవడానికి ఎంతో బాగుంటుంది అని అంటున్నారు. దాంతో నూరు శాతం ఆయనే అభ్యర్ధి అని అంటున్నారు. తమిళనాడుకు చెందిన శివని ముందు పెట్టి డీఎంకే కే కూడా బీజేపీతో తేల్చుకోవాలని చూస్తోంది.

సనాతనం వర్సెస్ ద్రవిడవాదం :

చాలా కాలంగా బీజేపీ సనాతనవాదం డీఎంకే ద్రవిడవాదం ల మధ్యన పోరు సాగుతోంది. సనాతన ధర్మాన్ని డీఎంకే యువ నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. సనాతన ధర్మం మీద బీజేపీ అయితే పేటెంట్ హక్కులు తమవే అని క్లెయిం చేసుకుంటోంది. అలాగే హిందీ భాషను తమిళనాడులో ప్రాధమిక విద్యా విధానం నుంచి తొలగించింది డీఎమెకే ప్రభుత్వం. ఆ విధంగా రెండు పార్టీల మధ్య ఒక రకమైన యుద్ధం అయితే సాగుతోంది. ఇపుడు అది ఓపెన్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ప్రతిష్ట గా తీసుకుంటూ :

నిజానికి ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకపక్షం చేయలని ఎన్డీయే అంటోంది. కానీ ఇండియా కూటమి నేతలు పార్టీలు అయితే ససేమిరా అని అంటున్నారు. అసలే పార్లమెంట్ వర్షాకల సమావేశాలు బీహార్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ మీద దద్దరిల్లుతున్నాయి. రాహుల్ గాంధీ అయితే ఓటు చోరీ అని జనంలోకి వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్డీయే ఇండియా కూటమిల మధ్య ఉప్పు నిప్పులా ఉంది. దాంతో ఎకగ్రీవం అన్నది కుదిరేది కాదని అంటున్నారు.

భీకరమైన పోరు:

తమిళనాడు గుండా దక్షిణాది మీద కన్నేసిన బీజేపీకి అదే తమిళనాడులోనే రెడ్ సిగ్నల్ చూపించాలని ఇండియా కూటమి పధక రచన చేసింది. దానికి సిద్ధాంతపరంగా బద్ధ శతృవుగా ఉన్న డీఎంకేనే ఫీల్డ్ లోకి దించుతోంది. సో ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికల సమరం భీకరంగా ఉండబోతోంది.