Begin typing your search above and press return to search.

సీట్లో కూర్చోగానే విజయ్ కి స్టాలిన్ మార్క్ హీట్ !

మాజీ ముఖ్యమంత్రి అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ఎంకే స్టాలిన్. ఆయన ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలు అయ్యారు.

By:  Satya P   |   10 May 2026 11:00 PM IST
సీట్లో కూర్చోగానే విజయ్ కి స్టాలిన్ మార్క్ హీట్ !
X

మాజీ ముఖ్యమంత్రి అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ఎంకే స్టాలిన్. ఆయన ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలు అయ్యారు. ఏకంగా తాను పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారీ తేడాతో పరాజయం పాలు అయ్యారు. అయినా సరే సీనియర్ పొలిటీషియన్ గా వ్యూహకర్తగా ఎన్నో ఇలాంటివి చూసిన నేతగా స్టాలిన్ ఎక్కడా తనలో నిరాశ దరి చేరనీయడం లేదు. ఉందిలో మంచి కాలం అనుకుంటూ డీఎంకేని పటిష్టంగా ఉంచుతున్నారు. అదే సమయంలో తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి సంప్రదాయం ప్రకారం అభినందనలు చెప్పారు. అదే సమయంలో కొత్త సీఎం కి ఇవ్వాల్సింది మెత్తగానే ఇచ్చేశారు. సీఎం సీట్లో కూర్చుని ఒక రోజు అయినా గడవలేదు కదా అని ఎక్కడా తగ్గకపోవడం స్టాలిన్ ప్రత్యేకతగా ఉంది అంటున్నారు.

సాకులు చెప్పొద్దంటు :

సీఎం కాగానే విజయ్ సాకులు వెతుక్కుంటున్నారు అని స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు. తమిళనాడుకు పది లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు ఉన్నాయని విజయ్ తన తొలి స్పీచ్ లో చెప్పడాన్ని స్టాలిన్ తప్పు పట్టారు. ఇవన్నీ తాను ఇచ్చిన హామీల అమలు విషయంలో వెనక్కి వెళ్ళి ప్రజలను మోసం చేసి తప్పు పట్టించాలని చూడవద్దు అని విజయ్ కి గట్టిగానే ఇచ్చేశారు. మీకు రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని తెలియదా అని ప్రశ్నించారు. తెలిసిన తరువాతనే కదా మీరు ఎన్నికల్లో అనేక ఉచిత హామీలు ఇచ్చారు అని నిలదీశారు.

మనసు ఉంటే చేయండి :

తమిళనాడు ప్రజలు మంచి చేయాలని మనసు ఉండాలని స్టాలిన్ సూచించారు. అంతే తప్ప డబ్బులు లేవు ఖజానాను గత ప్రభుత్వం ఖాళీ చేసింది అని కుంటి సాకులు చెప్పవద్దు అని విజయ్ కి స్టాలిన్ గట్టిగానే స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కరోనా లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొందని కేంద్రంలో బీజేపీ అయిదేళ్ళ పాటు నిధుల విషయంలో వివక్ష చూపించిందని, వరదలతో పాటు ఎన్నో సమస్యలు కూడా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయినా సరే ఎక్కడా తాము తగ్గలేదని అనేక సంక్షేమ పధకాలను అమలు చేసి చూపించామని అన్నారు.

పాలనా దక్షతతోనే :

ఏ ముఖ్యమంత్రి అయినా పాలనా దక్షతతోనే పనిచేయగలరని స్టాలిన్ అన్నారు. ముందు పాలనలో సూక్ష్మాలను నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లుగా స్టాలిన్ సెటైర్లు పేల్చారు. మేము అప్పులు చేసేసి ఖజానా ఖాళీ చేసినట్లుగా అధికారంలోకి వస్తూనే విమర్శలు చేయడం తగదని స్టాలిన్ హిత బోధ పలికారు. తమిళనాడు ఖజానాలో డబ్బులు ఉన్నాయని పాలనా దక్షతతో అందరికీ మేలు జరిగేలా చూడండి అని సూచించారు. అయినా పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని అమ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే ప్రకటించిదని స్టాలిన్ చెప్పారు.

ప్రజలకు మేలు చేయండి :

ప్రజలకు మేలు చేయాలని స్టాలిన్ కొత్త ముఖ్యమంత్రి విజయ్ కి సూచించారు. తాను కూడా తమిళనాడులోని అందరి ప్రజల మాదిరిగానే విజయ్ ఇచ్చిన అన్ని హామీలూ తీరుస్తారని ఆశతో చూస్తున్నాను అని ఆయన అన్నారు. తాను ఆచరణ సాధ్యమైన వాటినే హామీలుగా ఇస్తాను అని విజయ్ ఎన్నికల్లో చెప్పిన మాటలను స్టాలి గుర్తు చేశారు. పాలనలో మెలకువలను తొందరగా నేర్చుకోండి మాకు మాదిరిగానే ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలను అందించండి అని స్టాలిన్ కోరారు. విజయ్ పాలనలో తమిళనాడు అభివృద్ధి పధంలో సాగాలని కోరుకుంటున్నట్లుగా స్టాలిన్ చెప్పడం విశేషం. మొత్తానికి కంగ్రాట్స్ అని విజయ్ కి చెబుతూనే గట్టిగానే స్టాలిన్ ఇచ్చేశారు అని అంటున్నారు.