Begin typing your search above and press return to search.

డీకే నోట త్యాగం మాట...కర్నాటకంలో కొత్త ట్విస్ట్

కర్ణాటక రాజకీయం అలా నడుస్తూనే ఉంది. నవంబర్ నెల ఈ రాజకీయానికి వేదిక అయింది. రెండు రోజులలో నవంబర్ నెల కూడా ముగుస్తోంది. దాంతో కర్ణాటకానికి తెర లేస్తుందో పడుతుందా అన్నది అయితే ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

By:  Satya P   |   28 Nov 2025 11:15 PM IST
డీకే నోట త్యాగం మాట...కర్నాటకంలో కొత్త ట్విస్ట్
X

కర్ణాటక రాజకీయం అలా నడుస్తూనే ఉంది. నవంబర్ నెల ఈ రాజకీయానికి వేదిక అయింది. రెండు రోజులలో నవంబర్ నెల కూడా ముగుస్తోంది. దాంతో కర్ణాటకానికి తెర లేస్తుందో పడుతుందా అన్నది అయితే ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇంతకీ ఈ నవంబర్ కి కర్ణాటక రాజకీయానికి మధ్య ఏమిటి లింక్ అంటే చాలానే ఉంది మరి. కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య రెండున్నరేళ్ళ పదవీ కాలం నవంబర్ తో పూర్తి అవుతుంది. మరో రెండున్నరేళ్ళకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పగ్గాలు చేపడతారు అని కూడా ప్రచారంలో ఉంది. ఆ మేరకు 2023 మేలో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పెద్దలు ఇద్దరు నేతలకు మధ్య కీలక ఒప్పందం కుదిర్చారు అన్నది నాటి నుంచి నేటి వరకూ ప్రచారంలో ఉన్న మాట.

సీఎం సీటు కోసం :

ఇక ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ రాజకీయాల్లో పేరు గడించిన డీకే శివకుమార్ తానే ట్రబుల్స్ క్రియేట్ చేస్తారా అన్నది కూడా ఒక చర్చ. అయితే డీకేకు ఒక వైపు అనుచరుల ఒత్తిడి ఉంది. దానితో పాటుగా ఒప్పందం గుర్తుకు వస్తోంది. అంతే కాదు ఈ చాన్స్ పోతే మళ్ళీ వస్తుందా రాదా అన్న సంశయం కూడా ఉంది అని అంటున్నారు. రాజకీయాల్లో ఏపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఇక కాలి దాకా వచ్చినది కాశీకి పోయినా రాదు అని అంటారు. రాజకీయాలలో ఆ సామెత అతికినట్లుగా సరిపోతుంది. చాన్స్ కొన్ని సార్లే వస్తాయి, ఎక్కువ సార్లు చాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డీకే ప్రస్తుతం ఈ విషయాల మీద డోలాయమాన పరిస్థితులలో ఉన్నారు అని అంటున్నారు.

సోనియాను గుర్తుకు తెస్తూ :

తాజగా డీకే బెంగళూరు లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ త్యాగాల గురించి పస్తావించారు. 2024 లో ప్రధాని అయ్యే చాన్స్ తనకు దక్కినప్పటికీ దానిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ కి సోనియా ప్రధాని బాధ్యతలు అప్పగించారు అని చెప్పారు. నిజానికి రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ విషయం మీద ఇపుడే ఎందుకు డీకే గుర్తు చేసుకున్నారు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఆయన మాటల వెనకాల గూఢార్ధాలు వెతికే పనిలో విశ్లేషకులు కాంగెర్స్ నేతలు కూడా ఉన్నారు.

రాహుల్ తో భేటీ వేళ :

ఇక కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని రెండు రోజులలో డీకే శివకుమార్ సిద్ధ రామయ్య ఇద్దరూ కలవబోతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ విధంగా వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు ఊస్తే కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక రాజకీయం మీద రంగంలోకి దిగింది. ఇది సంక్షోభం దిశగా మారకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక సీఎం పదవి మార్పు అన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనలో ఉందో లేదో ఎవరికీ తెలియదు. అయితే రెండు వర్గాలుగా పార్టీ ఉంటే మాత్రం భారీగా నష్టపోతుంది అన్నదే కాంగ్రెస్ పెద్దల ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఇక కర్ణాటక వ్యవహారాన్ని సోనియా గాంధీ డీల్ చేస్తారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో సిద్ధరామయ్య డీకేలు ఇద్దరూ రెండు రోజులలో ఢిల్లీకి వెళ్తారు అని అంటున్నారు. మరి సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తు చేసిన డీకే తాను త్యాగమూర్తిగా మారుతారా లేక అమ్మ దయతో పదవిని అందుకుంటారా అన్నది తొందరలో తేలనుంది అని అంటున్నారు.