Begin typing your search above and press return to search.

ఉద్యోగుల మనసు దోచుకున్న కార్పొరేట్ కంపెనీ.. వీడియో వైరల్!

అవును... దీపావళి, దసరా వంటి పండుగలు సమీపిస్తున్నాయంటే.. వారు పనిచేస్తున్న కంపెనీలు బోనస్ లు ఇస్తాయని ఆశిస్తుంటారు.

By:  Raja Ch   |   17 Oct 2025 6:00 PM IST
ఉద్యోగుల మనసు దోచుకున్న కార్పొరేట్ కంపెనీ.. వీడియో వైరల్!
X

ఏవైనా రెండు మూడు సంస్థల్లోని ఉద్యోగులు ఒక చోట కలిస్తే... వారు పని చేస్తున్న కంపెనీల గురించి రకరకాల విషయాలు చెబుతారు. ఒకరి కంపెనీతో మరొకరి కంపెనీని పోల్చి మాట్లాడుతుంటారు. ఇక.. ఒకే కంపెనీకి చెందిన నలుగురు ఎంప్లాయిస్ మాట్లాడుకుంటే... పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయని అంటారు. ఎందుకంటే.. అందరూ ఆ సమయంలో కష్టం గురించే మాట్లాడుకుంటారని అంటారు.

ఈ విధంగా తాము పని చేస్తున్న సంస్థలపై ఉద్యోగులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇక.. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు సమయానికి జీతం ఇస్తే చాలని అనుకుంటే.. మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగులు మాత్రం దసరాకో, దీపావళికో బోనస్ లు ఇస్తే బాగుండని ఆశపడతారు. అయితే... తాజాగా మనం చెప్పుకోబోయే కంపెనీలోని ఉద్యోగులు మాత్రం.. ఆఫీసుకు వచ్చి ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయిపోయారు. సంస్థను తెగ పొగిడేస్తున్నారు.

అవును... దీపావళి, దసరా వంటి పండుగలు సమీపిస్తున్నాయంటే.. వారు పనిచేస్తున్న కంపెనీలు బోనస్ లు ఇస్తాయని ఆశిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది వాటిని పొందుతారు కూడా.. మరికొంతమంది స్వీట్ పాకెట్ తో సరిపెట్టుకుంటారు. ఇంకొంతమంది మాత్రం.. ఆ భాగ్యం మనకు లేదులే అని సర్ధుకుపోతారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఓ కంపెనీ తమ ఉద్యోగులకు దీపావళి సర్ ప్రైజ్ బహుమతులు ఇచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో... ఓ కార్పొరేట్ కంపెనీ తమ ఉద్యోగులకు అందించిన సర్ ప్రైజ్ బహుమతుల దృశ్యాలు ఉన్నాయి. ఇందులో భాగంగా... ఇంకా స్టాఫ్ రాకుండా ఖాళీగా ఉన్న ఆఫీసులో ప్రతీ ఛైర్ ముందు టేబుల్ పైనా బహుమతులతో కూడిన ట్రాలీ బ్యాగులు కనిపిస్తున్నాయి. వాటితో పాటు ఓ స్వీట్ ప్యాకెట్‌ ను కూడా ఇచ్చింది. ఇవి రెండూ గిఫ్ట్ ప్యాక్ చేసి ఉన్నాయి.

ఈ విధంగా... ఉద్యోగులు ఉదయం ఆఫీస్‌ కు వచ్చే ముందే బహుమతులు వారి సీట్ల వద్ద ఉంచి వారికి సర్‌ ప్రైజ్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు రెండు కోట్ల మంది వీక్షించగా.. దాదాపు 6 లక్షల మందికి పైగా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో తమ తమ స్పందనలను తెలియజేశారు. సదరు సంస్థ మేనేజ్మెంట్ పై ప్రశంసల జల్లులు కురిపించారు!

ఇందులో భాగంగా... నాకు ఆ ఆఫీస్‌ లో జాయిన్ కావాలని ఉందని ఒకరు కామెంట్ చేస్తే... ఈ వీడియో మా ఛైర్మన్ కి పంపిస్తానని మరొకరు స్పందించారు. ఇదే సమయంలో.. ఆ కంపెనీలో ఖాళీలు ఉంటే తనకు చెప్పాలని ఇంకొకరు అడగ్గా... ఈ దీపావళికి మా కంపెనీ ఉద్యోగులను తొలగించిందని క్రైయింగ్ ఎమోజీ తో మరొకరు స్పందించారు. ఏది ఏమైనా... ఈ వీడియో మాత్రం హల్ చల్ చేస్తోంది.