దిశాపటానీ ఇంటిపై కాల్పులు.. నిజం బయటపెట్టిన దుండగుడు!
దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపిన రామనివాస్ అనే షూటర్ ఎన్కౌంటర్ తర్వాత చేతులు ముడుచుకొని నేలపై పడుకొని నేను ఇంకెప్పుడూ యూపీకి రాను బాబా అంటూ పోలీసుల ముందు వాపోయాడు.
By: Madhu Reddy | 20 Sept 2025 3:53 PM ISTబాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిగిన సంఘటన ఇండస్ట్రీలో తీవ్ర దుమారం లేపిన సంగతి మనకు తెలిసిందే. అయితే దిశా పటాని సోదరి హిందూ మత గురువులను విమర్శిస్తూ వివాదాస్పదంగా మాట్లాడడంతో దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిగాయి. ఇప్పటికే కాల్పులు ఎవరు జరిపారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. అందులో ఇద్దర్ని ఎన్కౌంటర్ కూడా చేశారు.. అయితే తాజాగా దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్, ఆయన సహచరుడు ఇద్దరిని శుక్రవారం రోజు పోలీసులు అరెస్టు చేశారు. అలా పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆ షూటర్ వేడుకున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ షూటర్ ఏమని వేడుకున్నారంటే.. ఇకపై "ఎప్పుడూ ఉత్తరప్రదేశ్ కి రాను.. నన్ను వదిలేయండి బాబా" అన్నట్లుగా పోలీసులకు చెప్పాడట..
దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపిన రామనివాస్ అనే షూటర్ ఎన్కౌంటర్ తర్వాత చేతులు ముడుచుకొని నేలపై పడుకొని నేను ఇంకెప్పుడూ యూపీకి రాను బాబా అంటూ పోలీసుల ముందు వాపోయాడు. ఇక ఇందులో బాబా అంటే యూపీ సీఎం ఆదిత్యనాథ్ ని బాబా అని సంబోధించారు.. అయితే పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో రామ్ నివాస్ కాలికి బుల్లెట్ తగిలి గాయం అయింది. అలాగే రామ్ నివాస్ సహచరుడు అనిల్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వీరిని అదుపులోకి తీసుకున్నాక వారి నుండి 32 బోర్ పిస్టల్స్, నాలుగు లైవ్ కార్ట్రిడ్జ్ లు, నాలుగు స్పెండ్ షెల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో రామ్ నివాస్ దాడిలో తన ప్రమేయం ఉందని అంగీకరించాడు.అలాగే దాడి చేశాక తాను పారిపోయానని కూడా ఒప్పుకున్నాడు..
దిశా పటాని ఇంటిపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు బాల నేరస్థులను కూడా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం శుక్రవారం ఢిల్లీలో అరెస్టు చేసింది.. ఇందులో వారిద్దరి వయసు దాదాపు 17 సంవత్సరాలు ఉన్నట్టు తెలుస్తోంది.. వీరు పరారీలో ఉండగా వీరిని పట్టుకుంటే లక్ష రివార్డు ఇస్తామని పోలీసుల ఇప్పటికే ప్రకటించారు. అయితే ఢిల్లీలో శుక్రవారం రోజు వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
కాల్పుల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 17న హర్యానాలోని ఘజియాబాద్ లో ఢిల్లీ పోలీసుల సహకారంతో యూపీ ఎస్ టిఎఫ్ జరిపిన ఎన్కౌంటర్లో దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపిన మరో ఇద్దరు షూటర్లు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 11న దిశపటాని ఇంటిపై ఇద్దరు బాల నేరస్తులు కాల్పులు జరిపారు.ఆ తర్వాత సెప్టెంబర్ 12న అరుణ్, రవీంద్ర అనే మరో ఇద్దరూ రెండోసారి దాడికి పాల్పడ్డారు.
