Begin typing your search above and press return to search.

ప్ర‌ధాన్‌ త‌ప్పు చేయ‌లేదు: దేశం కోస‌మే త్యాగం!

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన త‌న విద్యాశాఖ ప‌ద‌వికి రాజీనామా చేసిన మూడు రోజులు అయింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

By:  Garuda Media   |   28 July 2026 5:00 PM IST
ప్ర‌ధాన్‌ త‌ప్పు చేయ‌లేదు:  దేశం కోస‌మే త్యాగం!
X

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన త‌న విద్యాశాఖ ప‌ద‌వికి రాజీనామా చేసిన మూడు రోజులు అయింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఈ విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ధ‌ర్మేంద్ర‌ప్ర‌ధాన్ రాజీనామా చేసిన త‌ర్వాత‌.. బీజేపీ ఎంపీలు ఆయ‌న‌కు పార్ల‌మెంటు వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ఘ‌ట‌న తీవ్ర‌స్థాయిలో ఉభ‌య స‌భ‌ల‌ను కుదిపేసింది. ఏమాత్రం ఆలోచ‌న లేకుండా.. కేంద్ర మంత్రికి స్వాగ‌తం ఎలా ప‌లుకుతార‌ని విప‌క్ష స‌భ్యులు ఘాటుగా ప్ర‌శ్నించారు.

దీనిపై కేంద్ర మంత్రి ఒక‌రు మాట్లాడుతూ.. ప్ర‌ధాన త‌ప్పుచేయ‌లేద‌ని పేర్కొన్నారు. అలా అయితే.. గ‌తం లో యూపీ ఏ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల స‌మ‌యంలో ఎంత మంది మంత్రులు రాజీనామా చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌ధాన్ త‌ప్పు చేయ‌లేద‌ని.. ఆయ‌న దేశం కోసం.. దేశాన్ని ప్రేమించే వారి కోసం.. అదృశ్య శ‌క్తులు దేశంలో అరాచ‌కాన్ని పెంచి పోషించ‌డాన్ని చూడ‌లేక రాజీనామా చేశార‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.

ఇక‌, పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు కూడా మంగ‌ళ‌వారం వ‌రుస‌గా వాయిదాల ప‌ర్వంలోనే కొన‌సాగాయి. ఆది నుంచి కూడా వాయిదా తీర్మానాల‌పై విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. ప‌శ్చిమ బెంగాల్ లో 20 మంది ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇక‌, మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిపై చ‌ర్య‌లు కోరుతూ.. ఈ పార్టీ కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. మ‌రోవైపు ధ‌ర్మేంద్ర‌ప్ర‌ధాన్ ఎందుకు రాజీనామా చేశారో.. పార్ల‌మెంటుకు వివ‌రించాల‌ని కొంద‌రు స‌భ్యులు కోరారు.

త‌ప్పు లేన‌ట్టే..

ఇక‌, ప్ర‌ధాన్ రాజీనామా వ్య‌వ‌హారంపై ఇటు బీజేపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఆయ‌న దేశ భ‌క్తికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు. మ‌రోవైపు.. కేంద్రంలోని పెద్ద‌లుమౌనంగా ఉన్నారు. ఇలా.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వ్య‌వ‌హారం ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంది. మ‌రోవైపు.. ఆయ‌న త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఎందుకు రాజీనామా చేశారో.. పార్ల‌మెంటుకు చెప్పాల‌ని మ‌ల్లికార్జున ఖ‌ర్గే వంటి సీనియ‌ర్ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.