Begin typing your search above and press return to search.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ప్రచారంలో నిజమెంత ?

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది అనూహ్యంగా జరిగింది అనే అంతా అంటున్నారు. ఎందుచేతనంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచనల్లో లేదని అంటున్నారు.

By:  Satya P   |   25 July 2026 10:28 PM IST
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ప్రచారంలో నిజమెంత ?
X

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది అనూహ్యంగా జరిగింది అనే అంతా అంటున్నారు. ఎందుచేతనంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచనల్లో లేదని అంటున్నారు. నీటి సహా జాతీయ పరీక్షల విషయంలో సమూలమైన ప్రక్షాళన దిశగానే కేంద్రం నడుం బిగించింది. అంతే కాదు చట్టం కూడా కొత్తగా తీసుకుని రాబోతోంది. సోమవారం దానిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. మరో వైపు చూస్తే కనుక ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర కేబినెట్ లో అతి ముఖ్యుడు. మోడీ అమిత్ షాలతో అత్యంత సన్నిహితమైన సంబంధాలు కలిగిన వారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన నేత. ఆయన తండ్రి నుంచి దశాబ్దాలుగా బీజేపీతో అనుబంధం ఉంది. అలాంటి నేత ఈ విధంగా ఒక ఉద్యమానికి తలొగ్గి రాజీనామా చేయడం అంటే బీజేపీ పెద్దలు కూడా జీర్ణించుకోలేని విషయమే. కానీ అది ఎలా సాధ్యపడింది. అనివార్యంగా ఎలా అది మారిపోయింది అంటే దాని మీద రకరకాలైన ప్రచారాలు అయితే వినిపిస్తున్నాయి.

భారీ ఉద్యమానికే దారి :

ఒక వేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే కనుక విద్యార్ధుల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని కూడా నిర్ణయించారు అని అంటున్నారు. సీజేపీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నా అదే సమయంలో అసాంఘీక శక్తులు కనుక దీనిని అనుకూలంగా మార్చుకుంటే ఈ ఉద్యమం కాస్తా భారీ హింసకు సైతం దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి ఈ విషయాన్ని వీటి వెనక ఉన్న అనుమానాలను ఇంటలిజెన్స్ వర్గాల పసిగట్టడంతోనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పందించింది అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

లా అండ్ ఆర్డర్ కోసం :

ఒకవేళ ఇదే విధంగా కేంద్ర మంత్రి రాజీనామాను ఇవ్వకపోయి ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్యకు కూడా అది దారి తీసే అవకాశాలు సైతం ఉన్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కూడా చాలా సామరస్య వైఖరిని ప్రదర్శించింది అని అంటున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా రాజకీయంగా ఎన్డీయేకు కొంత ఇబ్బందిని కలిగించినా అంతకంటే ఇబ్బందిని కూడా ప్రభుత్వం లేకుండా చేసుకుందని అంటున్నారు. విద్యార్ధి ఉద్యమాలు చాలా దూకుడుగా ఉంటాయి. అవి దారి తప్పేందుకు అసాంఘిక శక్తులు కనుక అందులో ప్రవేశిస్తే కట్టడి చేసేందుకు కూడా అవకాశం ఉండదని అంటున్నారు. ఈ లోగా జరగరానిది జరిగితే కనుక అది దేశంలోనే మరింత వేడిని రాజేసే పరిస్థితులు కూడా ఉంటాయన్నది కూడా అంచనా వేసుకున్న మీదటనే ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

తెలివైన నిర్ణయమే :

మొత్తం మీద చూసుకుంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం తెలివైన నిర్ణయమే తీసుకుంది అని అంటున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా వల్ల బీజేపీకి తాత్కాలికంగా ఇబ్బంది ఎదురైనా దీర్ఘకాలంలో అది మేలు చేస్తుందని అంటున్నారు. అంతే కాదు ఎవరైనా జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు కూడా ఇది ఒక ఒరవడిగా ఉంటుందని కూడా చెబుతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విధంగా పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుందని దేశంలోని ప్రజానీకం కూడా ఈ లాజికల్ ఎండ్ ని చూసి హర్షిస్తారు అని అంటున్నారు. అదే సమయంలో విపక్షాలకు సైతం రాజకీయ ఆట అన్నది లేకుండా బీజేపీ ఆఖరి కార్డు గా తన మంత్రి చేత రాజీనామా చేయించింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇక్కడ విజేతలు పరాజితులు ఎవరు అన్నది పక్కన పెడితే దేశం గత కొన్ని రోజులుగా చూస్తున్న ఘర్షణాత్మకమైన వైఖరులకు ముగింపు పలికినట్లు అయిందని ప్రశాంతతకు చోటు కల్పించినట్లు అయింది అని అంటున్నారు.