ధర్మాన స్పీక్స్ : అంతా వారిదే పెత్తనం !
కూటమి అన్నది పేరుకు ముసుగు మాత్రమే. మొత్తం పెత్తనం అంతా టీడీపీదే అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు మిత్ర పక్షాలు పక్క వాయిద్యాలే అని తేల్చేశారు.
By: Satya P | 17 Sept 2025 10:28 PM ISTఉత్తరాంధ్రాలో మేధావి రాజకీయ నేతగా పేరు పొందిన వారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చూశారు రెండు పదులు కాకుండానే సర్పంచ్ గా సొంత ఊరికి పనిచేసిన ఆయన ఆరున్నర పదుల వయసులో వైఎస్ జగన్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖగా బాధ్యతలు చేపట్టి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు ఎంతో మంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ధర్మాన మంచి మాటకారి, సబ్జ్కెట్ మీద పూర్తి అవగాహన ఉన్న వారు అని చెబుతారు.
సైలెంట్ కి బ్రేక్ :
ఇక ధర్మాన ప్రసాదరావు చాలా కాలంగా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. ఆయన వైసీపీలో ఉన్నారా లేరా అన్నది కూడా ఎవరికీ తెలియనంత నిశ్శబ్దం పాటించారు. వైసీపీ అధినాయకత్వానికి ఇటు క్యాడర్ కి కూడా ఆయన రాజకీయాల్లో ఉంటున్నారా లేక విరామం తీసుకుంటున్నారా అన్న సందేహాలు కూడా వచ్చేశాయి. అయితే ఎట్టకేలకు ధర్మాన నోరు విప్పారు తన సైలెన్స్ కి ఆయనే బ్రేక్ వేశారు.
టీడీపీ మీద విసుర్లు :
కూటమి అన్నది పేరుకు ముసుగు మాత్రమే. మొత్తం పెత్తనం అంతా టీడీపీదే అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు మిత్ర పక్షాలు పక్క వాయిద్యాలే అని తేల్చేశారు. తెలుగుదేశం కూడా రాజ్యాంగబద్ధమైన పాలన ఏమీ చేయడం లేదని ఆయన మండి పడ్డారు. అమరావతి రాజధాని పేరుతో లక్షలాది కోట్ల రూపాయలను ఒకే చోట కుమ్మరిస్తే ఆ అప్పు ఎవరు తీరుస్తారు అని లాజిక్ పాయింట్ ని ఆయన లాగారు. రాష్ట్రానికి వచ్చిన సంపద అంతా అన్ని ప్రాంతాలకు సమానంగా పంచితేనే అది రాజ్యాంగబద్ధ పాలన అవుతుందని చురకలు అంటించారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలోనే ఫోకస్ పెడుతోంది అన్నట్లుగా మాట్లాడారు.
కూటమి మీద పోరాడాలి :
గత ప్రభుత్వంలో చేసిన అనేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం దెబ్బ కొడుతోంది అని ఆయన విమర్శించారు. పేదలకు విద్య అందించే పధకాలు కూడా నిర్వీర్యం అయ్యాయని ఆయన మండిపడ్డారు. కూటమి పాలన మీద అంతా కలసి పోరాటం చేయాలని ఆయన కోరారు మొత్తం మీద చాలా కాలానికి ధర్మాన బయటకు వచ్చి టీడీపీ మీద ఘాటు విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. మరి ఇదే తీరున ఆయన ఇక ముందు కూడా దూకుడు పెంచుతారా లేక మామూలుగానే తన మౌనాన్నే ఆశ్రయిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ధర్మాన కూటమి మీద చేసిన పవర్ ఫుల్ విమర్శలు కానీ అమరావతి రాజధాని చెరువుగా మరిందని రైతులు రోడ్డెక్కారు అని చేసిన హాట్ కామెంట్స్ తో వైసీపీ అయితే ఖుషీగా ఉంది అని అంటున్నారు.
