ధర్మాన యాక్టివ్... వైసీపీకి లైన్ క్లియర్... !
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ యాక్టివ్ అయ్యారు.
By: Garuda Media | 20 Oct 2025 10:02 AM ISTసీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. సుదీర్ఘంగా ఏడాది పాటు ఆయన మౌనంగా ఉన్నారు. వైసీపీ తరఫున ఆయన రాజకీయాలు చేయరన్న వాదన కూడా వినిపించింది. ఇదేసమయంలో ఆయన తన కుమారుడి భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. కూటమి పార్టీలో ఒక దాని వైపు మొగ్గు చూపిస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కొన్నాళ్లు హల్చల్ చేసింది. అయితే.. ఆ ప్రయత్నాలు ఏమయ్యాయో.. తెలియదు.
ఇంతలో మెడికల్ కాలేజీల వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఈ కాలేజీలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలని.. తద్వారా ప్రభుత్వంపై భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించిన విష యం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ.. వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. అయితే.. అప్పట్లోనూ మౌనంగా ఉన్న ధర్మాన.. ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలపై ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.
బద్ధ శత్రువులు కూడా ఈ కాలేజీల ఏర్పాటును తప్పుబట్టలేరని అన్నారు. అంతేకాదు.. మెడికల్ కాలేజీల ద్వారా మేలు జరుగుతుందన్నారు. ఇదెలా ఉన్నప్పటికీ.. ధర్మాన యాక్టివ్ కావడంతో వైసీపీలో ఆసక్తికర చర్చ అయితే తెరమీదకి వచ్చింది. ఆయన పార్టీలోనే ఉంటున్నారని.. పార్టీ నుంచి బయటకు వెళ్లడం లేదన్న వాదన బలపడింది. ప్రస్తుతం.. సాక్షి మీడియాపై నిబంధనలు విధించడం సరికాదంటూ మరోసారి ధర్మాన మీడియా ముందుకు వచ్చారు. దీంతో ధర్మాన లైన్‌క్లియర్ చేశారన్న వాదనపార్టీలో వినిపిస్తోంది.
నిజానికి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్న ధర్మాన కనుక వెళ్లిపోయి ఉంటే పార్టీకి పెద్దమైనస్ అయి ఉండేది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామా జిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్న ధర్మాన.. స్థిరత్వం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఒకానొక దశలో ఆయన పార్టీ నుంచిబయటకు వెళ్లిపోతారని భావించినప్పుడు.. వైసీపీలో పెద్ద అలజడి రేగింది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. ధర్మాన యాక్టివ్ అయ్యారని తెలియడంతో శ్రేణులతోపాటు పార్టీ అధిష్టానం కూడా ఊపరి పీల్చుకుంది.
