Begin typing your search above and press return to search.

రద్దైన కరెన్సీ నోట్లు ఎన్ని ఉండొచ్చు? చట్టం ఏం చెబుతోంది?

అనంతరం వీటి వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయటం తెలిసిందే. అయినప్పటికీ కొందరు మాత్రం రద్దైన పెద్ద నోట్లను తమ వద్ద ఉంచేసుకున్న వైనాన్ని అధికార వర్గాలు గుర్తించాయి.

By:  Garuda Media   |   17 Dec 2025 12:00 PM IST
రద్దైన కరెన్సీ నోట్లు ఎన్ని ఉండొచ్చు? చట్టం ఏం చెబుతోంది?
X

కొన్నేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనంతరం.. ఎవరికి వారు తమ వద్ద ఉన్న పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని కోరటం తెలిసిందే. ఆ సందర్భంగా బ్యాంకుల వద్ద భారీ క్యూలు.. డబ్బుల కోసం పడిన పాట్లు ఎంతన్నది తెలిసిందే. ఈ సందర్భంగా బ్యాంకుల్లో పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవటం.. మార్చుకోవటానికి తగినంత సమయాన్ని ఇచ్చారు.

అనంతరం వీటి వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయటం తెలిసిందే. అయినప్పటికీ కొందరు మాత్రం రద్దైన పెద్ద నోట్లను తమ వద్ద ఉంచేసుకున్న వైనాన్ని అధికార వర్గాలు గుర్తించాయి. గతంలో రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను కలిగి ఉండటం నేరమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. కొందరు గుర్తు కోసం ఈ నోట్లను తమ వద్ద దాచేసుకున్నారు. రద్దైన పెద్దనోట్లను కలిగి ఉండటంపై చట్టం ఏం చెబుతోంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం 2017 పరకారం రద్దైన పెద్ద నోట్లు (రూ,500, రూ.1000) తక్కువ సంఖ్యలో కలిగి ఉండటం అసలు నేరమే కాదు. అయితే..దీనికి ఒక పరిమితిని విధించారు. ఒక వ్యక్తి దగ్గర పది నోట్లు గరిష్ఠంగా ఉండొచ్చు. అలా ఉండటం అసలు సమస్యలోకే రాదు. ఆ పరిమితికి మించి పెద్ద నోట్లు ఉంటే మాత్రం నేరమవుతుంది. అయితే.. ఇక్కడ కూడా ఒక మినహాయింపు ఉంది. అదేమంటే.. నోట్లను సేకరించి.. దాచి పెట్టే అభిరుచి ఉన్న వారు గరిష్ఠంగా తమ వద్ద పాతిక నోట్లను ఉంచుకోవచ్చు. అయితే.. ఈ నోట్లను ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు మాత్రం వినియోగించకూడదు.

ఇదంతా బాగానే ఉందనుకుందాం. ఒకవేళ ఒక వ్యక్తి తన దగ్గర ఉండాల్సిన పరిమితికి మించి రద్దైన కరెన్సీ నోట్లు ఉంటే అలాంటి వారికి అధికారులు ఎలాంటి శిక్షలు విధిస్తారన్నది చూస్తే.. కనీసం రూ.10వేల ఫైన్ కానీ సదరు వ్యక్తి వద్ద ఉన్న నోట్ల విలువకు ఐదు రెట్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకరి వద్ద రూ.20వేలు విలువైన రద్దైన పెద్దనోట్లు ఉంటే.. ఆ విషయాన్ని అధికారులు గుర్తిస్తే.. అతనికి రూ.లక్ష ఫైన్ వేయొచ్చు. అయితే.. ఎలాంటి జైలుశిక్ష మాత్రం ఉండదు. రద్దైన నోట్లు చట్టబద్ధమైనవి కాదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.