Begin typing your search above and press return to search.

మా గ్రాఫ్ ఎలా ఉంది.. ఎవ‌రి స‌ర్వేలు వారివే.. !

వచ్చే ఎన్నికల‌ నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు 80 కి పైగా పెరగనున్నాయి.

By:  Garuda Media   |   15 April 2026 8:15 AM IST
మా గ్రాఫ్ ఎలా ఉంది.. ఎవ‌రి స‌ర్వేలు వారివే.. !
X

వచ్చే ఎన్నికల‌ నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు 80 కి పైగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏ నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీకి ఎలాంటి అనుకూలత ఉంది.. ప్రజల నాడి ఏ విధంగా ఉంది.. అనే అంశాలపై ఆయా పార్టీలు తమదైన శైలిలో సర్వేలు చేసుకుంటున్నాయి. దీనిలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఎవరికి వారు తమ తమ స్థాయిలో సర్వేలను నిర్వహించుకుంటున్నారు. వీరిలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉండడం విశేషం.

ప్రస్తుతం కమ్యూనిస్టులకు పర్మినెంట్ గా ఒక నియోజకవర్గ అంటూ లేదు. గతంలో కొన్ని నియోజకవర్గాలు కమ్యూనిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. ఇప్పటికీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గా లు కమ్యూనిస్టులకు బలమైన కంచుకోటలుగా ఉన్నాయి. కానీ.. ఏపీ విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు ఉన్న నియోజకవర్గాలు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులకు బలంగా లేవు. ఇక ఈ నేపథ్యంలో నియోజకవర్గాల విభజన జరిగితే కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలు ఏవి అనే విషయంపై అంతర్గతంగా పార్టీ కేడర్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

ఇక కాంగ్రెస్లో ఈ తరహా సర్వేలు లేకపోయినప్పటికీ నాయకుల మధ్య చర్చ మాత్రం నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనీసం 10 నుంచి 15 స్థానాల్లో అయినా పార్టీ పుంజుకుంటుంది అన్నది సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక జనసేన కూడా అంతర్గత సర్వేలు ఉదృతం చేసింది. వచ్చే ఎన్నికల నాటికి తమకు బలమైన నియోజకవర్గాలు ఎలా ఉంటాయి.. పునర్విభజన జరిగితే ఓటు బ్యాంకు ఏ దిశగా ఏ నియోజకవర్గంలోకి మ‌ళ్లుతుంది. అనే అంశాలపై సర్వేలు చేసుకుంటున్నారు.

ఇక టిడిపి ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా నియోజకవర్గాల పరిస్థితిని తెలుసుకుంటూనే ఉంది. మరో కీలక పార్టీ బిజెపి. ఈ పార్టీలో కూడా అంతర్గతంగా సర్వే చేపట్టారు ఉత్తరాంధ్ర రాయలసీమలో బిజెపికి బలమైన నియోజకవర్గాలు ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో అదేవిధంగా రాయలసీమలో కూడా కొన్ని నియోజకవర్గాల‌ను బిజెపి గెలుచుకుంది. రేపు నియోజకవర్గం విభజన జరిగితే తమ బలం ఏ మేరకు పెరుగుతుంది అనేది అంచనా వేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సర్వేలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలను కలుస్తున్నారు. అదేవిధంగా మేధావుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. మరి ఏ పార్టీలకు ఏఏ నియోజకవర్గాలు ఏ మేరకు బలంగా ఉంటాయన్నది చూడాలి.