Begin typing your search above and press return to search.

ఢిల్లీ కాదు...ఇంద్రప్రస్థ

దేశ రాజధాని ఢిల్లీ పేరుని మార్చే ప్రతిపాదన ఉందా. దానిని బీజేపీ చురుకుగా పావులు కదుపుతోందా అన్నది ఇపుడు చర్చగా మారింది.

By:  Satya P   |   2 Nov 2025 3:00 AM IST
ఢిల్లీ కాదు...ఇంద్రప్రస్థ
X

దేశ రాజధాని ఢిల్లీ పేరుని మార్చే ప్రతిపాదన ఉందా. దానిని బీజేపీ చురుకుగా పావులు కదుపుతోందా అన్నది ఇపుడు చర్చగా మారింది. ఢిల్లీ అన్న పేరు చాలా పురాతనమైనది ఒక విధంగా చెప్పాలి అంటే వేల ఏళ్ళ చరిత్ర ఉంది. అయితే ఇపుడు సడెన్ గా ఢిల్లీ పేరుని మార్చాలని చూస్తున్నట్లుగా డిబేట్ అయితే నడుస్తోంది. నిజంగా ఢిల్లీ పేరు మారుస్తారా మారిస్తే పెట్టే పేరు ఏమిటి దానికి ఉన్న చారిత్రాత్మక పురాణేతిహాసాల ప్రాశస్త్యం ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది.

వెరీ ఓల్డ్ నేమ్ :

చరిత్రలోకి ఒక్కసారి వెళ్తే ఢిల్లీ అన్న పేరు రెండు వేల ఏళ్ళ నాటిది అని అర్ధం అవుతుంది. ఇక ఢిల్లీ అన్న దాని మొదటి ప్రస్తావన బహుశా క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నాటిది అని చరిత్రకారులు చెబుతారు. ఆ సమయంలో రాజుధిలు అనే పాలకుడు ఒక నగరాన్ని స్థాపించాడు. ఆయన పేరు మీదనే ధిల్లీ వచ్చింది అని అంటారు. అది అలా కొనసాగుతూ వచ్చింది. ఇక ఢిల్లీ పేరు తోమర్ రాజవంశం తో కూడా ముడిపడి ఉంది అని అంటారు. ఇక . ఈ పేరు నగరం నిరంతర విధ్వంసం కావడం అలాగే పునర్నిర్మాణం నుండి ఉద్భవించిందని కూడా చరిత్రకారులు నమ్ముతారు కొన్ని సిద్ధాంతాలు దీనిని వదులు అనే పదానికి ప్రాకృత పదం లేదా కదిలింది అనే అర్థం వచ్చే హిందీ పదం "దహల్-లి"తో అనుసంధానిస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీ అంటే మొఘల్ రాజులు పెట్టారని వారి వారసత్వమని కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ మన రాజులే వారి కాలంలోనే ఈ పేరు స్థిరపడింది అన్నది చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ఇంద్రప్రస్థం :

ఈ పేరు అయితే అందరికీ తెలుసు. ఎందుకంటే మహా భారతంలో దీని ప్రస్తావన ఉంది. పాండవులు నివసించిన నగరం ఇంద్రప్రస్థం. అందుకే ఢిల్లీకి ఇంద్రప్రస్థం అన్న పేరుని పెట్టాలని ఒక డిమాండ్ వస్తోంది. ఇంద్రప్రస్థం పేరుని ఢిల్లీకి పెట్టాలని తాజాగా ఢిల్లీ ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. ఢిల్లీ నగరానికి ఉన్న ప్రాచీన వారసత్వం సాంస్కృతిక నేపథ్యం అన్నీ ఇంద్రప్రస్థం పేరుతోనే ఎక్కువగా ఎలివేట్ అవుతాయని ఆయన అభిప్రాయపడుతున్నారు

యమనా తీరాన :

పాండవులు యమునా నది ఒడ్డున ఇంద్రప్రస్థం అనే నగరాన్ని నిర్మించుకుని అక్కడ నివసించారు కాబట్టి ఢిల్లీకి ఆ పేరే సబబు అని ఆయన అంటున్నారు. అలాగే పాత ఢిల్లీ స్టేషన్ ని ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్ గా మార్చాలని కోరారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇందిరాగాంధీకి బదులుగా ఇంద్రప్రస్థ పేరు పెట్టాలని కూడా ఆయన కోరారు.

వీహెచ్ పీ ప్రతిపాదన :

సరిగ్గా ఇదే విషయం మీద విశ్వహిందూ పరిషత్ కూడా డిమాండ్ చేస్తూ వస్తోంది. వీహెచ్ పీ ఢిల్లీ శాఖ కార్యదర్శి సురేంద్ర కుమార్ గుప్తా కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ అంటే కేవలం రెండు వేల ఏళ్ళ చరిత్ర గుర్తుకు వస్తుందని అదే ఇంద్రప్రస్థ అంటే వేళ్ల ఏళ్ళ నాటి చరిత్ర కళ్ళ ముందు ఉంటుందని ఆయన అంటున్నారు. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అనేక పేర్లను ఇప్పటికే మార్చిన బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటుందా అన్నదే చర్చ. పైగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సో ఈ డెసిషన్ తీసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.