రిపబ్లిక్ డే రోజే ఎర్ర కోట టార్గెట్...షాకింగ్ నిజాలు !
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటన దేశాన్ని మొత్తం ఉలిక్కిపడేలా చేసింది.
By: Satya P | 12 Nov 2025 12:45 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటన దేశాన్ని మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. గత మూడు రోజులుగా ఈ ఘటన మీద తీవ్ర స్థాయిలో విచారణ జరుగుతోంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్టింగ్ లింకులు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ ఏజెన్సీలు అక్కడ కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఎర్ర కోట టార్గెట్ ఈనాటిది కాదుట. ఇప్పటి పది నెలల క్రితం నాటిది అని నిందితులు చెప్పడం విశేషం. ఈ ఏడాది జనవరి 26నే భారీ పేలుడుకు ప్లాన్ చేశారు అని అంటున్నారు.
రెక్కీలు నిర్వహించి మరీ :
ఇక ఈ ఏడాది జనవరి 26న ఎర్ర కోట వద్ద జరిగే కార్యక్రమంలో వీవీఐపీలు సహా దేశం మొత్తం నాయకత్వం అక్కడ ఉంటుంది. ఆ రోజున బాంబు పేలుడుతో పెద్ద ముప్పునే తేవాలని నిందితులు స్కెచ్ గీసారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించిన విచారణలో వెల్లడి అయింది అంటున్నారు. ఎర్ర కోటనే టార్గెట్ చేస్తూ ఈ ఏడాది జనవరి మొదటి వారంలో అనేక సార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లుగా నిందుతులు చెప్పడం గమనార్హం. ఈ రెక్కీని డాక్టర్ ఉమర్ మహ్మద్ తో కలిసి తాను నిర్వహించినట్లుగా ఢిల్లీ బాంబు పేలుడు కేసులో నిందితుడు అయిన డాక్టర్ ముజమ్మిల్ గనీఎ జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు ఈ సమాచారాన్ని ముజమ్మిల్ గనీ మొబైల్ ఫోన్ నుంచి కూడా డేటా ద్వారా పోలీసులు సేకరించారు అని అంటున్నారు. దానిని ఆధారం చేసుకుని అతన్ని ప్రశ్నించిన మీదటనే ఈ విషయం అంగీకరించాడని అంటున్నారు.
దీపావళి టార్గెట్ :
ఇక రెండవ టార్గెట్ గా ఈ ఏడాది అక్టోబర్ 20న వచ్చిన దీపావళిని ఎంచుకున్నారని నిందితుడి నుంచి రాబట్టిన కీలక సమాచారం ద్వారా తెలుస్తోంది. అంటే ఆ రోజున కూడా ఢిలీలోని ముఖ్య కూడలు జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని బాంబు బ్లాస్ట్ చేసేందుకు కుట్ర పన్నారని వెల్లడి అవుతోంది. అయితే ఎందుకో అది అమలు చేయలేకపోయారు. కానీ నవంబర్ 10 సోమవారం సాయంత్రం మాత్రం బాంబ్ బ్లాస్ట్ చేసి పన్నెండు మంది దాకా ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. విశేషం ఏమిటి అంటే సోమవారం ఉదయమే హర్యానాలోని ఫరీదాబాద్ లో డాక్టర్ ముజమిల్ ఘనీ డాక్టర్ షాహిన్ స్య్యదలను యాంటీ టెర్రరిస్టు ఏజెన్సీ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇది జరిగిన కొద్ది గంటలలోనే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది.
భయపడి చేశాడా :
ఇక ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ లో డక్టర్ ఉమర్ నబీ ఆత్మహుతి అయ్యాడు. అయితే తన టీం అంతా ఉదయమే పోలీసులకు పట్టుబడడంతో భయంతో పాటుగా ఏమీ చేయలమని నిరాశతో ఈ విధంగా బాంబ్ పేలుడుకు పాల్పడినట్లుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే మరో వాదన ఏమిటి అంటే ఇది బాంబు బ్లాస్ట్ కోసం చేసినది కాదని ఉగ్ర స్థావరాన్ని ఫరీదాబాద్ నుంచి మరో చోటుకు మార్చే ప్రయత్నంలో కారులో భారీగా పేలుడు పదార్ధాలను వేసుకుని ప్రయాణిస్తున్నారని ఆ క్రమంలోనే సరిగ్గా అమర్చకపోవడంతో అది పేలిందని అంటున్నారు.
దాడి ఇపుడు కాదు :
నిజానికి నవంబర్ 10న దాడి చేయలని ఎర్ర కోట వద్ద బాంబు బ్లాస్ట్ చేయాలని ప్లాన్ అయితే కాదని అది ప్రమాదవశాత్తు జరిగిందనే ప్రాథమిక అంచనాల్లో తెలుస్తోంది. ఎందుకంటే భారీగా ప్రాణ ఆస్తి నష్టం వారి లక్ష్యమని తాజాగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల విచారణలో తెలుస్తున్న వాస్తవాలు. కానీ ఉగ్రవాదులు కొందరు అరెస్ట్, భారీ ఎత్తున అమ్మోనియం స్వాధీనం వంటి వాటి మూలంగా తప్పించుకునే ప్రయత్నంలో పొరపాటుగా జరిగినా ఒక భారీ పేలుడుగా కూడా భావిసుత్న్నారు. ఏది ఏమైనా ఈ పేలుడుతో అతి పెద్ద కుట్ర ఒకటి భగ్నం అయింది అని అంటున్నారు. కానీ ఈ ఉగ్ర మూకలు వారి వెనక ఉన్న శక్తులు ఇంకా దేశం దాటి దాయాది పాక్ వద్ద ఉన్న కేంద్ర స్థానంలో ఉన్న వ్యూహలు కుట్రలు ఇవన్నీ తెగని బలమైన లింకులు గానే ఉన్నాయి. వీటిని విప్పదీసి ఎంత లోతుకు వీలైతే అంత లోతుకు వెళ్తేతే తప్ప కూశాలు కదలవని అంటున్నారు ఆ దిశగానే దర్యాప్తు జరపాల్సి ఉంది.
