పెట్రోల్ కొట్టించుకోవాలంటే సర్టిఫికేట్ ఉండాల్సిందే !
ఈ దేశంలో ఇప్పటిదాకా ఏ రూల్స్ లేవు, దాంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.
By: Satya P | 19 Dec 2025 9:00 AM ISTఈ దేశంలో ఇప్పటిదాకా ఏ రూల్స్ లేవు, దాంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కాలుష్యం నియంత్రణ కోసం కఠినమైన చట్టాలనే తీసుకుని వచ్చారు. భారీ జరీమానాలు జైలు శిక్షలు అమలు చేసే విధంగా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆ విధంగా చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ అన్నది ఒక పకడ్బంధీ వ్యవహరాంగా జరుగుతూ ఉంటుంది.
భారత్ లో డేంజర్ బెల్స్ :
ఇక భారత దేశంలో జాతీయ రాజధానిగా ఉన్న ఢిల్లీ కాలుష్యం విస్ఝయంలో అగ్ర తాంబూలంగా ఉంది. దాంతో నివారణ మార్గాలను ఇపుడు వెతుకుతున్నారు. ప్రధానంగా ఈ కాలుష్యంలో అధిక వాటా ట్రాఫిక్ వల్లనే వస్తోంది అని తేలిన క్రమంలో వాహనాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులోనూ ఏళ్ళ తరబడి వినియోగంలో ఉంటూ భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించేందుకు ఇపుడు తగిన చర్యలను తీసుకుంటున్నారు.
పీయూసీ సర్టిఫికేట్ తో :
దీంతో ఢిల్లీ అంతటా ఉన్న అన్ని పెట్రోల్ పంపులు చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లు పీయూసీ లేని వాహనాలకు పెట్రోల్ ని పంపిణీ చేయడాన్ని నిలిపివేస్తూ ఢిల్లీ పాలకులు కొత్త ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పీయూసీ సర్టిఫికేట్లను గుర్తించేందుకు కెమెరా ఆధారిత వ్యవస్థల ద్వారా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలతో పాటు పెట్రోల్ పంపుల వద్ద వాయిస్ అలర్ట్ సిస్టమ్‌లు ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ పోలీసు సిబ్బంది ఈ విషయంలో కచ్చితంగా ఉంటూ ఈ రూల్స్ ని అమలు చేస్తున్నారు.
వాటిపైన నిషేధం :
అలాగే ఢిల్లీలోకి నిర్మాణ సామగ్రిని తీసుకువచ్చే ట్రక్కులపై ఢిల్లీ ప్రభుత్వం పూర్తి నిషేధాన్ని విధించింది. అంతేకాకుండా బీఎస్6 కేటగిరీ కంటే తక్కువ ఉన్న ప్రైవేట్ వాహనాలను ఢిల్లీ వెలుపలి నుండి అటు నుంచి అటే పంపిస్తున్నారు. ఈ విధానం గురువారం నుంచి దేశ రాజధానిలో అమలు అవుతోంది. దీని ద్వారా వాహానాల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించవచ్చు అన్నది ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన. అయితే ఇదే విధానాన్ని దేశవ్యప్తంగా కూడా అమలు చేస్తే బాగుంటుంది అన్న సూచనలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా మరింతగా కఠినమైన చర్యలను తీసుకోవాలని లేకపోతే కాలుష్యం తో యుద్ధమే చేయాల్సి ఉంటుందని మేధావులు నిపుణులు సూచిస్తున్నారు.
తగిన చర్యల ద్వారా :
కాలుష్యం వల్ల ఆరోగ్యం తో పాటు ఆదాయం కూడా తగ్గిపోతుంది. అభివృద్ధిలో కూడా వెనకబడతారు అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే స్థిరమైన పర్యావరణ హితమైన విధానాల కారణంగా ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్, నార్వే కాలుష్యం బారి నుంచి తప్పించుకుని మంచి ర్యాంకింగులో ఉంటున్నాయి. పరిశుభ్రమైన దేశాలుగా వీటిని చూస్తున్నారు. డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఎస్టోనియా, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కూడా కాలుషాన్ని నియంత్రించే విషయంలో సమర్ధవంతమైన పనితీరును కనబరుస్తున్నాయి
అభివృద్ధి చెందుతున్న దేశాలలో :
ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలలో చూస్తే కాలుష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ పరిష్కారాలలో ఏకీకృతమైన విధానాలు, సాంకేతిక పరమైన చర్యలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనుసరిస్తారు. అక్కడ స్వచ్ఛమైన గాలి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించే లక్ష్యంతో పనిచేస్తూ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్న బంగ్లాదేశ్ భారతదేశం వంటి చోట్ల తీవ్రమైన పీఎం 2.5 తరహా కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని అన్తర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
