రావణుడితో పాటు 30 అడుగుల బొద్దింక దహనం.. సీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు
ఇంట్లో బొద్దింక కనిపిస్తే దాన్ని తరిమికొట్టేందుకు కుటుంబ సభ్యులంతా రంగంలోకి దిగుతారు. కొందరు క్రిమిసంహారక మందులు చల్లుతారు.
By: A.N.Kumar | 20 Oct 2026 2:41 PM ISTదసరా వచ్చిందంటే చాలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనం నిర్వహించడం ఆనవాయితీ. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి భారీ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి నిప్పంటించడం చూస్తుంటాం. కానీ ఈసారి ఢిల్లీలో మాత్రం దసరా వేడుకలకు ఓ వెరైటీ ట్విస్ట్ నిర్వాహకులు ఇచ్చారు.. రావణుడితో పాటు ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింకను కూడా దహనం చేయనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి షాకిస్తూ ఆ పార్టీ సింబల్అయిన బొద్దింకను కాల్చేసి షాక్ ఇచ్చారు. దీంతో ఈసారి దసరా వేడుకల్లో రాక్షసులకే కాదు.. బొద్దింకలకూ ముప్పు తప్పేలా లేదు.
రావణుడికి పోటీగా సీజేపీ బొద్దింక.. ఇదేం కొత్త ట్రెండ్
ఢిల్లీలోని పితంపురాలో ఉన్న నేతాజీ సుభాష్ ప్లేస్ మైదానంలో ఈసారి దసరా వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీ కేశవ్ రామ్లీలా కమిటీ రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయాలని నిర్ణయించింది. సాధారణంగా రావణుడి పది తలలు, అతడి భారీ రూపం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి మైదానంలోకి అడుగుపెట్టినవారి చూపులు మాత్రం ఆ కాక్రోచ్ జనతా పార్టీ సింబల్ అయిన బొద్దింకపైనే పడే అవకాశముంది.
రావణుడిని సంహరించడం రామాయణ కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. మరి ఈ బొద్దింకను ఎందుకు దహనం చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. బొద్దింకలను చూస్తేనే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. ఇంట్లో చిన్న బొద్దింక కనిపించినా చీపుర్లు, చెప్పులు చేతబట్టి యుద్ధానికి దిగేవారు చాలామందే ఉంటారు. అలాంటిది 30 అడుగుల బొద్దింకను చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.కాక్రోచ్ జనతాపార్టీ పై ప్రతీకారంతోనే కొందరు ఇలా బొద్దింకను తగలబెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇంట్లో బొద్దింక కనిపిస్తే యుద్ధం.. ఇక్కడ ఏకంగా దహనం!
ఇంట్లో బొద్దింక కనిపిస్తే దాన్ని తరిమికొట్టేందుకు కుటుంబ సభ్యులంతా రంగంలోకి దిగుతారు. కొందరు క్రిమిసంహారక మందులు చల్లుతారు. మరికొందరు ఇంట్లోని వస్తువులన్నీ పక్కకు జరిపి మరీ వేట సాగిస్తారు. ఇంకొందరైతే బొద్దింక ఎగిరితే ఇంటి బయటకు పరుగులు తీస్తారు. అలాంటి బొద్దింకకు ఏకంగా 30 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేసి దహనం చేయడం నిజంగా వెరైటీనే. సీజేపీ పార్టీకి షాకిస్తూ ఇలాంటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ దిష్టిబొమ్మను చూస్తే ఒక సెటైరికల్ ప్రశ్న కూడా గుర్తుకు వస్తుంది. రావణుడి పది తలల్లో అహంకారం, అధర్మం వంటి చెడు లక్షణాలకు ప్రతీకలు కనిపిస్తే.. ఈ భారీ బొద్దింక దేనికి ప్రతీక? అంటే సింపుల్.. కాక్రోచ్ జనతా పార్టీకి సింబల్ అన్నమాట.. నిర్వాహకుల ఉద్దేశం ఏదైనా, ఈ ఆలోచన మాత్రం జనాల్లో ఆసక్తిని పెంచడం ఖాయం.
రావణ దహనంతో పాటు బొద్దింక దహనం.. సమస్యలు కూడా కాలిపోతాయా?
దసరా పండుగ వెనుక ఉన్న ప్రధాన సందేశం చెడుపై మంచి విజయం సాధించడమే. ప్రతి సంవత్సరం రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తాం. కానీ సమాజంలో అహంకారం, అవినీతి, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలు పూర్తిగా అంతమవుతున్నాయా? అన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది.
ఇప్పుడు ఈ జాబితాలోకి సీజేపీ బొద్దింకను కూడా చేర్చినట్టయింది. అయితే 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మను కాల్చినంత మాత్రాన సీజేపీ మాయమవుతాయనుకోవడం అత్యాశే! అసలు సమస్యకు పరిష్కారం కావాలంటే సీజేపీ చర్యలకు కేంద్రం, జనాలు ప్రత్యామ్మాయ చర్యలు చేపట్టాలి.
మరోవైపు రావణుడితో పాటు బొద్దింకను కూడా దహనం చేసే ఈ ఆలోచన దసరా వేడుకలకు కొత్త ఆకర్షణను తీసుకొస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ భారీ దిష్టిబొమ్మను చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఫొటోలు, వీడియోల రూపంలోనూ ఈ వినూత్న వేడుక చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఈసారి ఢిల్లీ దసరాలో రావణుడి పది తలలకే కాదు.. బొద్దింక భారీ సైజుకూ ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. రావణుడు కాలిపోతే అధర్మం అంతమవ్వాలి.. బొద్దింక కాలిపోతే సీజేపీపై చర్చ మొదలవ్వాలి.
