Begin typing your search above and press return to search.

'ఈ తీర్పు' మార్పు తీసుకొస్తుందా?!

ఇక్క‌డ మ‌రో కోణం కూడా ఉంది. పెద్ద‌ల‌ను ప‌ట్టించుకోని వారు.. వారి ఆస్తుల‌ను మాత్రం తీసుకుని.. వాటిని అమ్ము కుని పోతున్నారు. తాజాగా ఇలాంటి వారికి చెక్ పెట్టేలా ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది.

By:  Garuda Media   |   4 Oct 2026 9:14 AM IST
ఈ తీర్పు మార్పు తీసుకొస్తుందా?!
X

ఒక వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత‌.. పిల్ల‌లు ఉద్యోగాలు, కెరీర్ అంటూ.. ఊళ్లు ప‌ట్టుకుని పోతూ..ఇళ్ల‌ను వ‌దిలేస్తారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. కని పెంచిన వారిని కూడా వ‌దిలేయ‌డం ఇప్పుడు కామ‌న్‌గా మారింది. త‌ల్లిదండ్రుల మీద ద‌య‌లేని పుత్రులు పెరిగిపోతున్నార‌ని కోర్టులు కూడా ఆక్షేపిస్తున్నాయి. మ‌రోవైపు.. ప్ర‌భుత్వాలే వృద్ధాశ్ర‌మాల‌ను క‌ట్టించే ప‌రిస్థితి నెల‌కొంది. కేర‌ళ కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు వృద్ధా శ్ర‌మాలు నిర్మించేం దుకు ముందుకు వ‌చ్చింది. ఈ ప‌రిస్థితి మ‌రింత‌గా పెరుగుతోంది.

ఇక్క‌డ మ‌రో కోణం కూడా ఉంది. పెద్ద‌ల‌ను ప‌ట్టించుకోని వారు.. వారి ఆస్తుల‌ను మాత్రం తీసుకుని.. వాటిని అమ్ము కుని పోతున్నారు. తాజాగా ఇలాంటి వారికి చెక్ పెట్టేలా ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. పెద్ద‌ల‌ను ప‌ట్టించుకోని పిల్ల‌ల‌కు శ‌రాఘాతం అనేలాఉన్న ఈ తీర్పు.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. దీనిపై అనేక వీడియోలు కూడా వ‌స్తున్నాయి. ఈ తీర్పు మార్పు తీసుకువ‌స్తుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే జ‌రిగితే.. వృద్ధాశ్ర‌మాలు ఖాళీ అవుతాయ‌ని కూడా అంటున్నారు.

ఏంటా తీర్పు?

క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల‌లో జ‌రిగిన రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో త‌ల్లిదండ్రుల ఆస్తుల‌ను పంచుకున్న పిల్ల‌లు.. వారి పోష‌ణ‌ను మాత్రం వ‌దిలేశారు. క‌నీసం ఇంట్లో ఉండేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. అయితే.. అప్ప‌టికే త‌మ ఆస్తుల‌ను పిల్ల‌ల పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయించ‌డంతో ఆ పెద్ద‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు. ప‌రుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ కోర్టు.. కీలక ఉత్త‌ర్వులు ఇచ్చింది. పెద్ద‌ల‌ను ప‌ట్టించుకోని.. వారికి క‌నీసం ఒక ముద్ద కూడా పెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌ని పిల్ల‌ల‌కు ఆస్తుల‌ను ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింది.

అంతేకాదు.. ఒక‌వేళ అప్ప‌టికే రిజిష్ట్రేష‌న్ చేసి ఉన్నా.. వాటిని ర‌ద్దు చేసుకుని.. తిరిగా ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునే అవ‌కాశం ఇస్తూ.. సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. దీనికి ఒక‌వేళ పిల్ల‌లు అంగీక‌రించ‌క‌పోతే(అంటే.. అప్ప‌టికే ఆస్తులు వారి పేరుతో రిజిష్ట‌ర్ అయిన నేప‌థ్యంలో) క‌లెక్ట‌ర్ వ‌కాల్తా పుచ్చుకుని సంత‌కం చేస్తే..ఆటోమేటిక్‌గానే స‌ద‌రు ఆస్తుల రిజిస్ట్రేష‌న్ ర‌ద్దువుతుంది. అంతేకాదు.. పెద్ద‌ల‌కు త‌క్ష‌ణ‌మే హ‌క్కు కూడా వ‌స్తుంది. ఇక‌, పిల్ల‌ల‌ను ఇంటి నుంచి కూడా గెంటేయ‌వ‌చ్చ‌ని కోర్టు తేల్చి చెప్పింది. సో.. ఇప్ప‌టికైనా క‌న్న‌వారిని పిల్ల‌లు క‌డుపులో పెట్టుకుని చూసుకుంటారో లేదో చూడాలి.