Begin typing your search above and press return to search.

బాంబు పేలుడు తర్వాత తేరుకొంటున్న హస్తిన.. కీలక అప్ డేట్ ఇదే!

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనతో దేశంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   15 Nov 2025 8:00 PM IST
బాంబు పేలుడు తర్వాత  తేరుకొంటున్న హస్తిన.. కీలక అప్  డేట్  ఇదే!
X

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనతో దేశంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం నెలకొన్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని నడిబొడ్డున.. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో సంభవించిన భారీ పేలుడు ధాటికి అనేక వాహనాలు మంటల్లో చిక్కుకొనగా.. 13 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పదుల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో దేశమంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

ఈ పేలుడు ఘటనపై ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. అల్ ఫలా యూనివర్శిటీ కేంద్ర బిందువుగా ఈ పేలుడుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు పరిస్థితిని ప్రధాని స్వయంగా సమీక్షించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇదే సమయంలో.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును... ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఆ పేలుడులో రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డిజిటల్ నిఘాను పెంచారు.. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది!

కోలుకుంటోన్న ఢిల్లీ!:

ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో ఎర్రకోట వద్ద కాస్త సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో బాంబు పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పోలీసులు తెరిచారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంటులను తొలగించారు! దీంతో... రాకపోకలకు అనుమతి లభించింది.

ఈ సందర్భంగా... ఘోరమైన పేలుడు తర్వాత గత నాలుగు రోజులుగా మూసివేయబడిన ఎర్రకోట మెట్రో స్టేషన్‌ ను ఈరోజు ప్రయాణికుల కోసం తిరిగి తెరిచారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం గేట్ నంబర్లు 2, 3 తెరవబడ్డాయి.. గేట్లు 1, 4 ప్రస్తుతానికి మూసివేయబడి ఉంటాయి!

అల్ పలా యూనివర్శిటీ విద్యార్థి అరెస్టు!:

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును ఎన్.ఐ.ఏ. వేగవంతం చేస్తోంది! ఈ క్రమంలో... పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని.. హర్యానాలోని అల్ ఫలా యూనివర్శిటీలో విద్యార్థి జనీసూర్ ఆలం అలియాస్ నిసార్ ఆలం గా గుర్తించారు!