Begin typing your search above and press return to search.

భారీ పేలుడు వెనక ఉగ్ర కోణం ?

ఇంత పకడ్బందీగా ఢిల్లీ లాంటి చోట అందునా ఎర్ర కోట సమీపంలో భారీ పేలుడు స్కెచ్ ఎవరు గీశారు అన్నదే జాతీయ దర్యాప్తు సంస్థలు ఇపుడు కూపీ తీసే పనిలో ఉన్నాయి.

By:  Satya P   |   10 Nov 2025 10:53 PM IST
భారీ పేలుడు వెనక ఉగ్ర కోణం ?
X

అంతా ప్రశాంతంగా ఉంది. అంతా సజావుగా సాగుతోంది. అసలు ఇలాంటి ఘటన ఒకటి జరుగుతుందని ఎవరూ అసలు ఊహించని నేపధ్యం ఉంది. అంచనా సైతం వేయలేదు. అయితే అనూహ్యంగా కారు బాంబుతో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్ర కోట వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్ట్ లో ఏకంగా పది మంది దాకా మరణించారు. పాతిక మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి దారుణ ఘటన జరగడం వెనక ఏమై ఉంటుంది, కుట్ర ఏమైనా ఉందా అసలు ఏమిటి అన్నది కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చే పనిలో పడ్డాయి.

సెలవు కావడంతో :

ఢిల్లీ ఇపుడు కాలుష్యంతో సతమతం అవుతున్నది . శీతాకాలం కావడంతో జనాలు సైతం పెద్దగా అలికిడి లేదు. అయితే ఎర్ర కోట వద్ద సాయంత్రం 6.55 నిమిషాలకు ఈ ఘటన జరిగింది అని అంటున్నారు. ఆ సమయంలో కొంత జన సమ్మర్ధం అయితే ఉంది. కానీ భారీ ప్రాణ మష్టం జరగకుండా కాపాడింది మాత్రం ఎర్ర కోట సందర్శనకు సెలవు కావడమే. ప్రతీ సోమవారం సెలవు ఇస్తారు. దాంతో భారీ సంఖ్యలో వచ్చే సందర్శకులు అయితే సోమవారం లేరు. ఒకవేళ సందర్శకులు కనుక మామూలు రోజులలో వచ్చి ఉంటే ఈ ప్రమాధం తీవ్రత ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని అంటున్నారు.

కుట్ర వెనక :

ఇంత పకడ్బందీగా ఢిల్లీ లాంటి చోట అందునా ఎర్ర కోట సమీపంలో భారీ పేలుడు స్కెచ్ ఎవరు గీశారు అన్నదే జాతీయ దర్యాప్తు సంస్థలు ఇపుడు కూపీ తీసే పనిలో ఉన్నాయి. దీని వెనక ఉగ్ర కోణం ఏమైనా ఉందా అని కూడా ఆరా తీసే పనిలో పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడి జరిగింది. పహల్గాం దాడి దేశాన్ని ఎంతటి విషాదంలోకి నెట్టిందో తెలిసిందే. మళ్ళీ ఇపుడు అమాయకుల ప్రాణాలకు కారు బాంబు పేలుడుతో ముప్పు వాటిల్లింది. దాంతో ఉగ్ర కోణం కూడా ఏమైనా ఉంటుందా అన్నది కూడా విచారిస్తున్నారు.

దేశమంతా హై అలెర్ట్ :

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తరువాత దేశమంతా హై అలెర్ట్ ప్రకటించారు. ప్రత్యేకించి ముంబై హైదరాబాద్ వంటి చోట్ల మరింతగా గస్తీ పెంచారు. అక్కడ నాకా బందీని నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే చాలు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. వాహనాలు అన్నీ తనిఖీ చేయడమే కాదు డౌట్ ఉంటే తీసి పక్కన పెడుతున్నారు. ఇక ఢిల్లీ పరిసర ప్రాంతాలలో సైతం నిఘా పెంచేశారు. హర్యానా యూపీలతో సరిహద్దులు పంచుకుంటున్న ఢిల్లీ ప్రాంతాలలో గట్టి ఫోకస్ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఘటన పట్ల సీరియస్ గా ఉంది. తొందరలోనే నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. మొత్తం మీద దేశానికి ఇది అత్యంత విషాద ఘటనగా ఉంది.