Begin typing your search above and press return to search.

కాలుష్యం పెరుగుతోంది.. హోటళ్లలో అవి బ్యాన్

ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే చాలు కాలుష్యం దారుణంగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.

By:  A.N.Kumar   |   16 Dec 2025 1:15 PM IST
కాలుష్యం పెరుగుతోంది.. హోటళ్లలో అవి బ్యాన్
X

ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే చాలు కాలుష్యం దారుణంగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆ గాలి నాణ్యతను పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే పొగ వచ్చే ప్రతిదాన్ని నిషేధించే పనిలో పడింది. ఇప్పటికే వాహనాల పొగను నియంత్రించిన ప్రభుత్వం ఇప్పుడు కట్టెల పొయ్యిలపై పడింది.

దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయు కాలుష్య సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే నగరంలోని గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ 413గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థాయి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం.. ఢిల్లీ ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ మండలి కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వాయు కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన కారణాలపై దృష్టి సారించిన ప్రభుత్వం, హోటళ్లు, తినుబండార కేంద్రాల్లో బొగ్గు, కట్టెలతో పనిచేసే తందూర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇక పై ఢిల్లీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బొగ్గు తందూర్లను ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. దీనివల్ల ముఖ్యంగా ఢిల్లీ వంటకాలలో కీలకమైన తందూరి ఐటెమ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. తందూరి రొట్టెలు, కబాబ్స్, చికెన్ వంటి వంటకాలు నగరానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్నాయి. ఈ నిషేధం హోటల్ రంగానికి కొంత ఇబ్బందిగా మారినా.. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది.

అయితే హోటళ్లకు పూర్తిగా ప్రత్యామ్మాయం లేకుండా నిషేధం విధంచలేదు. బొగ్గు , కట్టెల తందూర్లకు బదులుగా విద్యుత్ లేదా గ్యాస్ ఆధారిత తందూర్లను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. ఇవి కాలుష్యాన్ని తక్కువగా ఉద్గరిస్తాయని.. పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.

మొత్తానికి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో కీలకం. తాత్కాలికంగా అసౌకర్యం కలిగించినా.. దీర్ఘకాలంలో స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన జీవితం కోసం ఈ నిర్ణయాలు అవసరమని పర్యావరణవాదులు అభిప్రాయపడుతున్నారు.