ఢిల్లీ గాలితో ఉక్కిరిబిక్కిరి...డేంజరస్ కండిషన్
ఢిల్లీలో గాలి కాలుష్యం పెద్ద ఎత్తున పెరుగుతుంది. బుధవారం చూస్తే కనుక ఉదయానికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే 420 దాకా ఉంది.
By: Satya P | 12 Nov 2025 12:17 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెచ్చరిల్లుతోంది. ఎటు చూసినా పీల్చేందుకు తగిన నాణ్యతలో గాలి అయితే లేదు, ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతూంటే ఆ గాలిని పీల్చలేక జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులు వ్యాధి పీడితులకు అయితే నరకం తలపిస్తోంది. ఈ గాలి ధూళిని పీల్చుతూ ఊపిరితిత్తులు ఎంత ఒత్తిడికి గురి అవుతున్నాయో అని వైద్య నిపుణులు అంటున్నారు. అంతకంతకు గాలిలో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడంతో జనాలు తల్లడిల్లుతున్నారు.
దారుణంగా క్షీణత :
ఢిల్లీలో గాలి కాలుష్యం పెద్ద ఎత్తున పెరుగుతుంది. బుధవారం చూస్తే కనుక ఉదయానికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే 420 దాకా ఉంది. ఇది ఒక డేంజర్ సిగ్నల్ అని నిపుణులు అంటున్నారు. దీంతో ఢిల్లీ ప్రమాదకరమైన జోన్ గా మారిందని అధికారులు సైతం చెబుతున్నారు. ఇక కేంద్ర కాలుష్య మండలి లెక్కల ప్రకారం చూస్తే కనుక ఢిల్లీలోని మెజారిటీ ప్రదేశాలు కానీ ప్రాంతాలు కానీ 400కి పైగా దాటినట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఉండడం గమనార్హం. ఇక ఇదే ఢిల్లీలో మరి కొన్ని ప్రాంతాలు ఉదాహరణకు వజీర్పూర్ వంటి చోట్ల ఏకనా 460 పై దాటేసింది అని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలియచేస్తోంది.
మాస్క్ లే దిక్కు :
ఢిల్లీలో బయటకు రావాలంటే మాస్క్ పెట్టుకోవడం కచ్చితమని అధికారులు తెలియచేస్తున్నారు. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం కంటే ఇది కొంతలో కొంత నయం అని అంటున్నారు ఈ వాయు కాలుష్యంతో గుండె జబ్బుల వారు ఇతర దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు రక్షించుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది ఆసుపత్రుల పాలు అవుతున్నారు. అనేక మంది చర్మ వ్యాధులకు గురి అవుతున్నారు ఆయాసంతో ఊపిరి పీల్చలేని పరిస్థితి ఎదురవుతోంది.
వారితో చర్చించాల్సిందే :
ఢిల్లీలో శీతాకాలం వస్త వాయు కాలుష్యం అధికం అవుతుంది. దానికి కారణం చుట్టు పక్కన పంటల వ్యర్థాలను కాల్చడం అని అంటున్నారు. ఢిల్లీని ఆనుకుని ఉన్న యూపీ హర్యానా పంజాబ్ వంటి రాష్ట్రాలలో రైతులు పంటలో వేస్ట్ గా ఉన్న వాటిని తెచ్చి మరీ సరిహద్దుల వద్ద మంటలు పెట్టి కాల్చేస్తున్నారు. దాంతో అసలే కాలుష్యంతో నిండిపోయిన ఢిల్లీ ఈ దెబ్బతో మరింత ఎక్కువగా అవస్థ పడుతోంది. దాంతో ఈ పని చేయకుండా వారిని ఆపేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాల్సి ఉందని అంటున్నారు. ఇక పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల విషయంలో కూడా ఢిల్లీ ప్రభుత్వం లేటెస్ట్ గా కొన్ని నిర్ణయాలు అమలు చేస్తోంది. ఒకటి నుంచి అయిదవ తరగతి చదివే విద్యార్ధుల విషయంలో హైబ్రీడ్ విధానం అమలు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశించారు. అలాగే ప్రజల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. మొత్తానికి చూస్తే ఢిల్లీలో గాలి మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అన్నది జనాల మాట.
