Begin typing your search above and press return to search.

ఢిల్లీలో వాయు కాలుష్యం... డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కీలక ఆదేశాలు!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   16 Dec 2025 4:00 AM IST
ఢిల్లీలో వాయు కాలుష్యం... డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కీలక ఆదేశాలు!
X

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 498ని తాకడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... వాయు కాలుష్యం దృష్ట్యా ఐదో తరగతి వరకూ విద్యార్థులను హైబ్రిడ్ నుంచి పూర్తిగా ఆన్ లైన్ మోడ్ లోకి మార్చాలని ఆదేశించింది.

అవును... దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటికే చాలా మంది ఆరోగ్యంపై ప్రభావం చూపించిందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, అన్ ఎయిడెడ్ ప్రైవేటు స్కూల్స్ లలో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థులకు ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వహించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్క్యులర్ జారీ చేసింది!

ఈ విషయాలను విద్యార్థుల తల్లితండ్రులు, సంరక్షకులకు వెంటనే తెలియజేయాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించింది. అయితే.. ఆరో తరగతి నుంచి అంతకంటే ఎక్కువ తరగతులకు ఎలాంటి మార్పూ లేకుండా తరగతులు కొనసాగుతాయని.. డిసెంబర్ 13న జరీ చేసిన మునుపటి సూచనల ప్రకారం (హైబ్రిడ్ మోడ్ లో!) తరగతులు నిర్వహించబడతాయని సర్క్యులర్ స్పష్ట చేసింది.

కాగా... ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకీ తీవ్రమైపోతుండటంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 498ని తాకిన పరిస్థితి. ఇది గరిష్టమైన తీవ్రమైన స్థాయి 500కి రెండు అడుగుల దూరంలో ఉంది. ఈ క్రమంలో.. నగరంలోని సుమారు 38 ప్రదేశాలలో ఏక్యూఐ తీవ్రమైన స్థాయిలను, రెండు ప్రదేశాలు చాలా పేలవమైన స్థాయిలను నమోదు చేసింది. ఈ క్రమంలోనే జహంగీర్ పురిలో దారుణంగా 498ని సూచిస్తుంది!

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం... 0 నుంచి 50 మంధ్య ఏక్యూఐ మంచిది కాగా.. 51 నుంచి 100 మంధ్య సంతృప్తికరం.. 101 నుంచి 200 మధ్య మద్యస్థం.. 201 నుంచి 300 మధ్య పేలవం.. 301 నుంచి 400 మంది చాలా పేలవం.. ఇక, 401 నుంచి 500 మంధ్య తీవ్రమైన పరిస్థితిగా పరిగణించబడుతుంది!