డైరెక్ట్ గా జగన్ కాన్వాయ్ కే అడ్డం పడిన దస్తగిరి !
ఇక జగన్ కాన్వాయ్ కొంత సేపు దస్తగిరి స్కార్పియో కారణంగా ఆగిపోయింది. దీంతో పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
By: Satya P | 1 Nov 2026 1:26 PM ISTదస్తగిరి అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా జనాలకు తెలుసు. బెయిల్ మీద ఉంటూ ప్రస్తుతం పులివెందులలో ఉంటున్నాడు. అంతే కాదు వివేకా హత్య కేసులో అప్రూవర్ గా కూడా మారిపోయాడు. ఆ దస్తగిరి ఇపుడు ఏకంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్ కే అడ్డంగా తన స్కార్పియో వాహనాన్ని పెట్టడం అంటే ఇది సోషల్ మీడియాను ఊపేసే న్యూస్ గానే ఉందిపుడు. ఎక్కడ నుంచి వచ్చాడో ఏమో తెలియదు కానీ జగన్ కాన్వాయ్ కి అడ్డంగా తన స్కార్పియో ని పెట్టి దస్తగిరి డేరింగ్ గానే నిలిచాడు అంటున్నారు.
జెడ్ ప్లస్ కేటగిరీ :
ఇక చూస్తే వైసీపీ అధినేత జగన్ జెడ్ ప్లకేటగిరీలో ఉంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది వీవీఐపీ హోదా అన్న మాట. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రతా సిబ్బంది సంఖ్య 59 గా ఉంటుంది. జెడ్ ప్లస్ భద్రతను బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎస్కార్ట్‌ను కూడా జగన్ కి ఉంటుంది. మరి ఇంత కట్టుదిట్టంగా ఉన్న ఒక మాజీ సీఎం కాన్వాయ్ కి అడ్డుగా దస్తగిరి తన స్కార్పియో పెట్టడం అంటే దీని మీదనే చర్చ సాగుతోంది. జగన్ హెలిపాడ్ నుంచి కాన్వాయ్ ద్వారా భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తుండగా ఆ దారి మధ్యలో దస్తగిరి స్కార్పియో అడ్డంగా నిలిపి ఉంచారు.
తీవ్ర ఉద్రిక్తతగా :
ఇక జగన్ కాన్వాయ్ కొంత సేపు దస్తగిరి స్కార్పియో కారణంగా ఆగిపోయింది. దీంతో పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా ఆగ్రహించిన వైసీపీ అభిమానులు అంతా దస్తగిరి వాహానాన్ని చుట్టుముట్టారు. ఆ సమయానికి పోలీసులు వచ్చి దస్తగిరిని అక్కడ నుంచి పంపించివేశారు. అనంతరం జగన్ కాన్వాయ్ సాఫీగా ఆయన నివాసానికి చేరుకుంది.
ఇక దస్తగిరి జగన్ కాన్వాయ్ ఆగిన వెంటనే తన స్కార్పియో వాహనం నుంచి దిగి జగన్‌ను ఉద్దేశించి గట్టిగా కేకలు వేసినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు ఆయన అక్కడ ఉన్న వైసీపీ నాయకులతో కూడా వాగ్వివాదానికి దిగాడని అంటున్నారు. ఒక్కసారిగా స్కార్పియోతో వచ్చి అడ్డం పడిన దస్తగిరి ఘటన హఠాత్పరిణామానికి దారి తీసింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులు వెంటనే చొరవ తీసుకుని దస్తగిరిని అడ్డుకుని పక్కకు లాగేశారు. అసలే స్థానిక ఎన్నికలతో వేడెక్కిన పులివెందులలో ఈ ఘటన మరింత కాక పుట్టించింది. ఏకంగా పులివెందుల నడిరోడ్డుపై కాసేపు తీవ్ర గందరగోళం ఉద్రిక్త వాతావరణం దస్తరిగి స్కార్పియోతో సృష్టించాడు. అయితే ఆయన్ని కొందరు ఉసిగొల్పి ఇలా పంపించారు అని వైసీపీ నేతలు అంటున్నారు. జెడ్ ప్లస్ భద్రతతో ఉన్న జగన్ కాన్వాయ్ కి అడ్డం పడడం అన్నది మామూలు విషయం కాదని ఇది భద్రతా లోపం దీని మీద తాము ఫిర్యాదు చేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.
