Begin typing your search above and press return to search.

దానం వారి ఆటా పాటా.. సంకేతం ఇదే బ్రో!

త‌న‌తోపాటు.. కానిస్టేబుళ్ల‌ను కూడా ఉర్రూత‌లూగేలా చేశారు. తాజాగా విడుద‌లైన ప్యార‌డైజ్ సాంగ్‌కు ఆయ‌న స్టెప్పులు వేశారు.

By:  Garuda Media   |   25 Sept 2026 7:09 PM IST
దానం వారి ఆటా పాటా.. సంకేతం ఇదే బ్రో!
X

ఖైర‌త‌బాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తూ.. తాజాగా కోర్టు ఉత్త‌ర్వుల‌తో ఎమ్మెల్యే పీఠాన్ని చేజార్చుకున్న దానం నాగేంద‌ర్‌.. ఆ బాధ‌ను మ‌రిచిపోయే ప్ర‌య‌త్నం చేశారు. శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌న ఘ‌ట్టంలో ఆయ‌న హాయిగా తుళ్లుతూ గ‌డిపారు. త‌న‌తోపాటు.. కానిస్టేబుళ్ల‌ను కూడా ఉర్రూత‌లూగేలా చేశారు. తాజాగా విడుద‌లైన ప్యార‌డైజ్ సాంగ్‌కు ఆయ‌న స్టెప్పులు వేశారు.

ఖైర‌తాబాద్ గ‌ణనాథుడి నిమ‌జ్జ‌న ఘ‌ట్టం అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో నిమ‌జ్జ‌న ఘ‌ట్టం కూడా ముగిసింది. కేవ‌లం రెండు కిలో మీట‌ర్ల దూరంలోని హుస్సేన్ సాగ‌ర్‌లో బ‌డా గ‌ణ‌ప‌తిని నిమ‌జ్జ‌నం చేసేందుకు సుమారు ఆరు గంట‌ల పాటు శోభాయాత్ర నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న దానం.. సంప్ర‌దాయ త‌ల‌పాగా ధ‌రించి.. క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఉత్సాహంగా క‌నిపించారు. ప‌లువురితో క‌లిసి ఆయ‌న స్పెప్పులు వేశారు.

ఎందుకు?

గ‌తంలో ఎప్పుడూ దానం నాగేంద‌ర్ ఇలా చేయ‌క‌పోవ‌డం.. ఇప్పుడు మాత్ర‌మే చేయ‌డం వెనుక‌.. ఇటీవ‌ల సుప్రీం కోర్టు సైతం ఆయ‌నను ఎమ్మెల్యేగా కొన‌సాగించేందుకు వీల్లేద‌ని తీర్పు ఇవ్వ‌డ‌మే. దీంతో స‌హ‌జంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవ‌మానం.. పైగా కేడ‌ర్ కూడా నిస్తేజంగా మారుతుంది. దీంతో భ‌విష్య‌త్తులో తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణా మాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థులు గేలి చేసే అవ‌కాశం ఉంటుంది. ఇది తీర్పు కంటే కూడా.. అత్యంత బాధ‌ క‌లిగించే విష‌యం. దీంతో దానం త‌న‌దైన శైలిలో వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చారు.

శుక్ర‌వారం ఉద‌య‌మే మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. తీర్పును స్వాగ‌తిస్తున్నాన‌ని.. అయితే, త‌న‌వంతు ప్ర‌య‌త్నంగా న్యాయ‌పోరాటం చేశాన‌ని ఇది త‌ప్పుకాద‌ని చెప్పారు. వ‌చ్చే బై పోల్స్‌లో త‌న‌కు అవ‌కాశం ఇస్తే.. గెలిచి తీరుతాన‌ని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణ‌యాన్ని శిర‌సావ‌హిస్తాన‌ని అన్నారు. త‌న కేడ‌ర్ బ‌లంగా ఉంద‌ని.. ఖైర‌తాబాద్ అంటే దానం.. దానం అంటే ఖైర‌తాబాద్ అంటూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌రం శోభా యాత్ర‌లో పాల్గొని కేడ‌ర్‌ను ఉత్సాహ ప‌రిచారు.