Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టుకు వెళ్ల‌ను: దానం .. నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా అన‌ర్హ‌త వేటు ప‌డిన దానం నాగేంద‌ర్‌.. తాజాగా మీడియాతో మాట్లాడారు.

By:  Garuda Media   |   19 Sept 2026 5:47 PM IST
సుప్రీంకోర్టుకు వెళ్ల‌ను:  దానం .. నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
X

ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా అన‌ర్హ‌త వేటు ప‌డిన దానం నాగేంద‌ర్‌.. తాజాగా మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ను స్వాగ‌తిస్తున్న‌ట్టు తెలిపారు. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌బోన‌ని చెప్పారు. తీర్పు మేర‌కు న‌డుచుకుంటాన‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో పోరాటం చేయ‌డం.. త‌న‌కుకొత్త‌కాద‌న్న దానం.. మ‌రోసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. కొట్లాడ‌తాన‌ని చెప్పారు. ఎన్నిక‌ల్లో పోరాటం చేసే ఈ స్థాయికి తాను ఎదిగాన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. త‌న నిర్ణ‌యం వెనుక ఎవ‌రి ప్ర‌మేయం లేద‌న్నారు. తాను స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకునే స్థాయిలోనే ఉన్నాన‌ని, దీని వెనుక ఎవ‌రూ లేర‌ని తెలిపారు.

పోటీ చేయ‌డం సాధ్య‌మేనా?

ఇక‌, హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో దానంపై వేటు ప‌డింది. ఆయ‌న‌ను అన‌ర్హుడిగా స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం సెక్ష‌న్ 10ప్ర‌కారం.. దానంను అన‌ర్హుడిగా పేర్కొంటారు. ఇదే జ‌రిగితే.. ఆరు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఆయ‌న పోటీ చేయ‌డానికి వీల్లేదు. అయితే.. హైకోర్టు తీర్పులో 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో దానం పోటీ చేసిన నాటి నుంచే అన‌ర్హ‌త ప్రక్రియ ప్రారంభ‌మైన‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న‌పై వేటు అనేది.. అప్ప‌టి నుంచేవ‌ర్తిస్తుంది. ఫ‌లితంగా.. ఇప్ప‌టికే రెండేళ్ల స‌మ‌యం గ‌డిచిపోయిన‌ట్టుగా భావించాలి. అన‌ర్హ‌త వేటు అమ‌ల్లోకి వ‌చ్చాక‌.. మ‌రో నాలుగు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే దానం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

ఉప ఎన్నిక వ‌స్తే..

హైకోర్టు తీర్పు మేర‌కు దానం పై అన‌ర్హ‌త వేటు ప‌డితే.. దీనిని ఆయ‌న సుప్రీంకోర్టు లో స‌వాల్ చేయ‌క‌పోతే.. ఉప ఎన్నిక రావ‌డం ఖాయం. ఆరు మాసాల్లో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక వ‌స్తుంది. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీకి దిగుతార‌న్న‌దిఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే.. తాజాగా హైకోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత‌.. బీఆర్ఎస్ శ్రేణులు ఖైర‌తాబాద్‌లో సంబ‌రాలు చేసుకున్నాయి. త‌మ పోరాటం స‌క్సెస్ అయింద‌ని.. కీల‌క నాయ‌కులు పేర్కొన్నారు. అయితే.. దానం సుప్రీంకోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో బీఆర్ ఎస్ అధిష్టానం త‌దుప‌రి వ్యూహంపై దృష్టి పెట్టింది. అవ‌స‌ర‌మైతే.. అక్క‌డ కూడా బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించేలా వ్యూహం ర‌చిస్తున్న‌ట్టు పేర్కొంది.

కాంగ్రెస్ సైలెంట్‌..

మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ ఈ వ్య‌వ‌హారంపై మౌనం వ‌హించింది. హైకోర్టు తీర్పు ద‌రిమిలా.. నాయ‌కులు ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా జంపింగ్ ఎమ్మెల్యేల‌పై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. గ‌తంలో కూడా.. ఈ విష‌యం కోర్టుల ప‌రిధిలో ఉంద‌ని.. స్పీక‌ర్ నిర్ణ‌యం మేర‌కు జ‌రుగుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారంలో దానంపై హైకోర్టు సీరియ‌స్ కావ‌డం.. తీర్పు ఇవ్వ‌డం జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ... కాంగ్రెస్ నాయ‌కులు మౌనం వ‌హించారు.