Begin typing your search above and press return to search.

దూసుకొస్తున్న భారీ తుఫాన్...ఉత్తరాంధ్ర కు పెను గండం

ఇక ఈ భారీ తుఫాన్ మరింత బలపడి ఆ తదుపరి మూడు రోజులలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

By:  Satya P   |   23 Oct 2026 11:34 PM IST
దూసుకొస్తున్న భారీ తుఫాన్...ఉత్తరాంధ్ర కు పెను గండం
X

ఒక భారీ తుఫాన్ దూసుకుని వస్తోంది. అది ఉత్తరాంధ్ర కు, దక్షిణ ఒడిషాకు మధ్యలో కేంద్రీకృతమై అలజడి రేపనుంది. ఆగ్నేయం దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఈ నెల 26వ తేదీ సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భారీ తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నాలుగు రోజుల పాటు :

ఇక ఈ భారీ తుఫాన్ మరింత బలపడి ఆ తదుపరి మూడు రోజులలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక అల్పపీడనం అనంతరం వాయుగుండం ఆ మీదట తుఫాన్ ఈ విధంగా పరిణమించే ఈ ప్రకృతి విపత్తు ప్రభావంతో రాష్ట్రంలో అటు కోస్తా జిల్లాల నుంచి ఇటు ఉత్తరాంధ్రా వరకూ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ తుఫానుగా మారిన తరువాత సోమవారం నుంచి ఉత్తరాంధ్రా జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు మరో మూడు రోజుల పాటు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

తీరం దాటే ముందు :

ఉత్తరాంధ్రా కేంద్రంగా ఏర్పడే భారీ తుఫాను ప్రభావంతో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతే కాదు తీర ప్రాంతాలలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మొదలై తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 నుండి 140 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక అక్టోబర్ 28 ఉదయం పూట ఈ తుఫాను ఉత్తరాంధ్ర ఒడిశా సరిహద్దుల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఏ జిల్లాను దాటుతుందో అన్నది ఇపుడు చర్చగా ఉంది. గత నెలలో తుఫాను అయితే శ్రీకాకుళం వద్ద తీరం దాటింది. దాంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈసారి ఏ విధంగా తుఫాన్ గమనం ఉండబోతోంది అన్నదే అధయయం చేస్తున్నారు.

అంతా అప్రమత్తంగా :

ఈ తుఫాను అక్టోబర్ 28న ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల మధ్య ల్యాండ్‌ఫాల్ అయ్యే అవకాశం ఉండటంతో కోస్తాంధ్ర ప్రాంతానికి భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ భారీ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 29 దాకా భారీ వర్షాలు పడతాయని చెబుతున్నార్జు ఉండొచ్చు అని అంటున్నారు. దాంతో సాధారణ ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.