Begin typing your search above and press return to search.

ప్రళయ భీకరంగా ఏపీ వైపు దూసుకొస్తున్న మోంథా

మోంథా తుఫాన్ ప్రళయ భీకర రూపంలో ఏపీ వైపు దూకుడుగా కదులుతోంది. ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుని వస్తోంది.

By:  Satya P   |   27 Oct 2025 12:21 PM IST
ప్రళయ భీకరంగా ఏపీ వైపు దూసుకొస్తున్న మోంథా
X

మోంథా తుఫాన్ ప్రళయ భీకర రూపంలో ఏపీ వైపు దూకుడుగా కదులుతోంది. ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుని వస్తోంది. ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు ఉమ్మడి తొమ్మిది జిల్లాల మీద తీవ్ర ప్రభావం మోంథా తుఫాన్ చూపించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా మొత్తం అన్ని ఉమ్మడి జిల్లాలలో రెడ్ అలెర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది.

ఇటీవల కాలంలో లేదు :

ఈ తరహా భీకర తుఫాన్ ఇటీవల కాలంలో లేదని అంటున్నారు. ఇది భారీ తుఫాన్ మాత్రమే కాదు పెను నష్టం కలిగించే ప్రళయ గర్జన గా చెబుతున్నారు. అతి పెద్ద ముప్పుగా భారీ ప్రకృతి విపత్తుగా పేర్కొంటున్నారు. ఏపీలో దాదాపుగా అన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మోంధ్తా ప్రభావంతో భారీ వానలు కోస్తా అంతా విస్తారంగా కురుస్తున్నాయి. ఈ భారీ వానలకు తోడుగా పెను గాలులు కూడా వీస్తూ జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

రెండు రోజుల పాటు :

చెన్నైకి దాదాపుగా 650 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఈ తుఫాను చాలా వేగంగా ఏపీ వైపు దూసుకుని వస్తొంది. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 560 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి 620 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంకి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్ ఏర్పడింది. ఇక దీని వేగన్ చూస్తే గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ మొంథా తుపాన్ దగ్గరకు వచ్చే కొద్ది తీవ్రమైన ఏపీలోని కోస్తా జిల్లాలలో మొత్తంగా చూపించే అవకాశాం ఉందని అంటున్నారు.

తుఫాను తీవ్రత భీకరమే :

తుఫానులు ఏపీకి కొత్త కాదు, అందులో అక్టోబర్ నవంబర్ లో వచ్చే తుఫానుల తీవ్రత కూడా బాగా అవగాహన ఉనిద్. అయితే మోంథా తుఫాన్ తీరు చూస్తే మరింత ఆందోళన కలిగించేలా ఉంది. అని అంటున్నారు. ఈ తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవరాం ఉదయానికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాదు తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణం విభాగం అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

రెడ్ ఆరెంజ్ ఎల్లో :

వాతావరణ శాఖ అధికారులు ప్రమాద హెచ్చరికలను సూచించేందుకు ఈ విధంగా రెడ్ ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే ఏపీలో మొత్తం 26 జిల్లాలలో 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ కావడం మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని సూచిస్తోంది. అలాగే ఆరెంజ్ అలెర్ట్ మరో ఎనిమిది జిల్లాకు ఇంకో నాలుగు జిల్లాలలకు ఎల్లో ఎలెర్ట్ ని సూచించారు. ఇందులో రెడ్ అలెర్ట్ జిల్లాలు అన్నీ కోస్తాలోనే ఉండడం గమనార్హం. దాంతో ఈ ప్రాంతాలలో ప్రజలు పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబు స్వీయ పర్యవేక్షణ :

ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ఏ విధంగా మోనిటరింగ్ చేయాలో ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలో పూర్తి అనుభవం కలిగిన వారు సీఎం చంద్రబాబు. ఆయన దుబాయ్ నుంచి వస్తూనే తుఫాను ప్రమాద తీవ్రతను గుర్తించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు ఎప్పటికపుడు తగిన సూచనలు అధికారులకు చేస్తూ కీలకమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాన్ కదలికలపై ఎస్ఎంఎస్, సోషల్ మీడియా, ఐ వి ఆర్ ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. సమాచార లోపం లేకుండా 27 వేల మొబైల్ టవర్ల వద్ద డీజిల్ జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తీర ప్రాంతంలో మత్స్యకారులను అప్రమత్తం చేయాలన్నారు. వారికి సురక్షితమైన షెల్టర్లకు తరలించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు