21 ఏళ్ల ఇన్ ఫ్లుయెన్సర్ కు కిడ్నీ దానం చేసిన నాన్న
ఆమెకు 21 ఏళ్లు. లక్షల్లో పాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా సుపరిచితం. అలాంటి ఆమె కిడ్నీలు రెండు పాడైపోయిన నేపథ్యంలో ఆమెకు కిడ్నీ దానం చేయటం ద్వారా పునర్జన్మను ప్రసాదించారు.
By: Garuda Media | 1 Dec 2025 10:31 AM ISTఆమెకు 21 ఏళ్లు. లక్షల్లో పాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా సుపరిచితం. అలాంటి ఆమె కిడ్నీలు రెండు పాడైపోయిన నేపథ్యంలో ఆమెకు కిడ్నీ దానం చేయటం ద్వారా పునర్జన్మను ప్రసాదించారు. ఢిల్లీకి చెందిన క్యూటీ మెందిరత్తా అనే యువతి సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నారు. అనూహ్యంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీకి చెందిన ఈ ఇన్ ఫ్లుయెన్సర్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
దీనికి కారణం.. ఆమె ఆరోగ్య సమస్యలే. తొలుత యూరిన్ ఇన్ ఫెక్షన్ తో ఆరోగ్య సమస్యలు మొదలైన ఆమె.. కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో.. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె రెండు కిడ్నీలు పూర్తిగా పాడైన విషయాన్ని వైద్యులు గుర్తించారు. దీంతో.. ఆమెకు సూట్ అయ్యే కిడ్నీ కోసం వెతికే వేళ.. ఆమె తండ్రి కూతురికి అవసరమైన కిడ్నీని దానం చేసేందుకు ముందుక వచ్చారు.
నెల క్రితమే క్యూటీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ఆమె మరింత హెల్దీగా ఉండాలన్న ఆకాంక్ష సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. తన కిడ్నీ దానంతో క్యూటీకి పునర్జన్మను ప్రసాదించారని చెప్పాలి.
