Begin typing your search above and press return to search.

‘కావ్.. కావ్..’ వెనుక వాటి మస్తిష్కంలో నిక్షిప్తమైన భావోద్వేగాలు ఎన్నో తెలుసా?

అవును... కాకి అరిస్తే చుట్టాలు వస్తారని చెబుతుంటారు. దీనర్ధం... గతంలో ఈ ఇంటికి వచ్చిన వ్యక్తులను ఎక్కడో చూసి, ఇక్కడి వారికి ఇంటిమేషన్ ఇస్తుందని, వాటికి అంత జ్ఞాపకశక్తి ఉంటుందని చెబుతారు.

By:  Raja Ch   |   29 July 2025 3:00 PM IST
‘కావ్.. కావ్..’ వెనుక వాటి మస్తిష్కంలో నిక్షిప్తమైన భావోద్వేగాలు ఎన్నో తెలుసా?
X

మనకు నిత్యం ఎన్నో పక్షులు కనిపిస్తుంటాయి. పట్టణాల సంగతి కాసేపు పక్కనపెడితే... గ్రామాల్లో అయితే కోళ్లు, పావురాలు, గువ్వలు, గోరింకలు, సీజన్ లో కోకిలలు, వడ్రంగి, కౌజు పిట్టలు, కొంగలు మొదలైనవి కనిపిస్తుంటాయి. అన్నింటికంటే ఎక్కువగా కాకులు కనిపిస్తాయి! ఈ క్రమంలో కాకులపై సుమారు ఆరేళ్ల పాటు జరిగిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అవును... కాకి అరిస్తే చుట్టాలు వస్తారని చెబుతుంటారు. దీనర్ధం... గతంలో ఈ ఇంటికి వచ్చిన వ్యక్తులను ఎక్కడో చూసి, ఇక్కడి వారికి ఇంటిమేషన్ ఇస్తుందని, వాటికి అంత జ్ఞాపకశక్తి ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో తాజాగా శాస్త్రీయంగా.. నాడు పెద్దలు చెప్పిన విషయం నిజం అని తేలింది! కాకులకు ఉన్న జ్ఞాపకశక్తి వేరే లెవెల్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

కొన్ని ప్రత్యేక పరిస్థితులతో సంబంధం ఉన్న మానవ ముఖాలను కాకులు సుమారు ఐదు సంవత్సరాల వరకు గుర్తుంచుకోగలవని.. వీటికి సంబంధించిన విషయాలను అవి తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా పంచుకుంటాయని తాజాగా ఒక అధ్యయనం కనుగొంది. ఈ సందర్భంగా... కాకులు వాటి అసాధారణ తెలివితేటలకు ప్రసిద్ధి చెందాయని వెల్లడించింది.

ఈ సందర్భంగా... వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఐదు సంవత్సరాలుగా జరిపిన అధ్యయనంలో మానవ ముఖాలను కాకులు సుమారు ఐదేళ్ల వరకూ గుర్తించుకుంటాయని తేలిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా పరిశోధకులు.. వాషింగ్టన్‌ లోని సీటెల్‌ లోని వారి క్యాంపస్‌ లోనూ, సమీపంలోని ఐదు ప్రదేశాలలో వీటిని పరిశోధించారు.

ఈ సందర్భంగా కాకులను ట్రాప్ చేయడం, వాటికి బ్యాండేజ్ చేయడం, విడుదల చేయడానికి ముందు ఓ ప్రత్యేకమైన ముసుగు / మాస్క్ ను ధరించారు. ఆ తర్వాత ముసుగు ధరించిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు కాకులు ఎలా స్పందిస్తాయో గమనించారు. ఈ సందర్భంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ ముఖాన్ని వర్ణించే ముసుగు ధరించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగాలో ఓ రకం ముసుగులో కాకులను ఇబ్బంది పెట్టగా, మరో రకం ముసుగులో వాటికి ఆహారం అందించడం, స్నేహంగా మెలగడం వంటివి చేశారు. ఈ సమయంలో... తమకు ఇబ్బంది కలిగించిన వ్యక్తి ముఖాన్ని ఏళ్లు గడిచిన తర్వాత కూడా అవి గుర్తించి గట్టిగా అరవడమే కాకుండా వాటితో పాటు మరికొన్నింటినీ వెంటపెట్టుకొచ్చినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో వాటికి ఆహారం పెట్టి, స్నేహంగా మెలిగిన వారిని చూసి ఉత్సాహంగా కనిపించినట్లు.. వారికి పూసలు, చిన్న చిన్న టోకెన్లు వంటి బహుమతులను అందించినట్లు చెబుతున్నారు! సో... కాకులు అరిస్తే చుట్టాలు రావడమే కాదు.. ఆ అరుపుల వెనుక వాటి మస్తిష్కంలో నిక్షిప్తమైన జ్ఞాపకాలు, భావోద్వేగాలు కూడా ఉన్నాయన్నమాట.