'బ్యాలెట్'లోనూ బావురు మన్నారు: కాంగ్రెస్‌కు మోడీ చురకలు
అన్ని చోట్లా బ్యాలెట్‌పైనే పోలింగ్ పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకుంది?`` అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్టు చేశారు.
By: Garuda Media | 28 Oct 2026 11:28 PM IST`ఓట్ చోరీ` జరిగిందని, సర్ ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనకు దిగినవేళ.. ముఖ్యంగా నవంబరు 1న చేపట్టనున్న ఢిల్లీ భారీ నిరసన నేపథ్యంలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆయా రాష్ట్రాల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా పోలింగ్ నిర్వహించారు. వీటిలో ఉపాధ్యాయ, గ్యాడ్యుయేట్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థలు వంటివి ఉన్నాయి. ఇవన్నీ.. ఈవీఎంలు కాకుండా పూర్తిగా బ్యాలెట్ పేపర్‌పైనే ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. అయితే.. 28 స్థానాల్లో ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కలేదు.
మరీ ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉన్నప్పటికీ.. అక్క డకూడా ఒక్క సీటును కైవసం చేసుకోలేక పోయింది. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. ``బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా.. బావురు మన్నారు`` అంటూ ఆయన చురకలు అంటిచంఆరు. ‘బ్యాలెట్ పేపర్‌తో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నిసీట్లు గెలిచింది..?’ అని ప్రశ్నించారు. ``నాలుగు అతి పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్లలో 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా బ్యాలెట్‌పైనే పోలింగ్ పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకుంది?`` అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్టు చేశారు.
ఎక్కడెక్కడ ఎన్నెన్ని..?
1) కర్ణాటక (మొత్తం స్థానాలు: 4). కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. బీజేపీ-జేడీఎస్ కూటమి మొత్తం 4 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ: 3 స్థానాలు (సౌత్-ఈస్ట్ గ్రాడ్యుయేట్స్, వెస్ట్ గ్రాడ్యుయేట్స్, నార్త్-ఈస్ట్ టీచర్స్). జేడీఎస్: 1 స్థానం (బెంగళూరు టీచర్స్) గెలుచుకుంది.
2) ఉత్తర్‌ప్రదేశ్(మొత్తం స్థానాలు: 11). 5 పట్టభద్రుల, 6 ఉపాధ్యాయుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ 5 చోట్ల గెలిచింది.
3) బిహార్ (మొత్తం స్థానాలు: 8). 4 పట్టభద్రుల, 4 ఉపాధ్యాయ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ(ప్రశాంత్ కిశోర్) దర్భంగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో గెలిచింది. ఆర్జేడీ పాట్నా టీచర్స్ స్థానంలో, జేడీయూ పాట్నా గ్రాడ్యుయేట్స్ స్థానంలో, బీజేపీ: తిర్హుత్ ఉపాధ్యాయ స్థానంలో విజయం దక్కించుకున్నారు.
4) మహారాష్ట్ర (మొత్తం స్థానాలు: 5). 3 పట్టభద్రుల (పుణె, నాగ్‌పూర్, ఛత్రపతి శంభాజీనగర్), 2 ఉపాధ్యాయుల (పుణె, అమరావతి) స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ పూర్తిగా బీజేపీ నేత`త్వంలోని అధికార పార్టీ అన్ని చోట్లా విజయం దక్కించుకుంది.
