ఏదొచ్చినా... టీ-కాంగ్రెస్‌కు ఎగ్జామేనా?!
దీంతో తెలంగాణ కాంగ్రెస్‌కు.. ఏది వచ్చినా.. పెద్ద పరీక్షగా మారిందని అంటున్నారు. తాజాగా వచ్చిన స్థానిక ఎన్నికలు కూడా దీనికి అద్దం పడుతున్నాయని చెబుతున్నారు.
By: Garuda Media | 4 Oct 2025 2:00 PM ISTచిన్న ఎన్నికల నుంచి పెద్ద ఎన్నికల వరకు.. చిన్న స్థాయి పదవుల నుంచి పెద్ద పదవుల దాకా ఏది వచ్చినా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పరీక్షగా మారుతున్నాయా? లెక్కకు మిక్కిలి నాయకులు ఉండడంతో ఎవరికి ఎలాంటి పదవి ఇస్తే.. ఇతరులు హర్ట్ అవుతారన్న వాదన వినిపిస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌కు.. ఏది వచ్చినా.. పెద్ద పరీక్షగా మారిందని అంటున్నారు. తాజాగా వచ్చిన స్థానిక ఎన్నికలు కూడా దీనికి అద్దం పడుతున్నాయని చెబుతున్నారు.
వాస్తవానికి ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల ఆఖరు లో కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రానుంది. వాస్తవానికి ఈ రెండు ఎన్నికలు కూడా .. ప్రభుత్వంపై ప్రభావం చూపించేవి కాదు. నాయకులు ఆగ్రహించినా.. ఇప్పట్లో రేవంత్ రెడ్డి సర్కారుకు వచ్చిన ఇబ్బంది కూడా లేదు. కానీ.. అంతర్గత కుమ్ములాటలు, సర్కారుపై వ్యతిరేకతను పెంచేం దుకు ఇవి దోహద పడనున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో అంతర్మథనం ప్రారంభమైంది.
అందుకే.. స్థానికం నుంచిజూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వరకు.. అన్ని విషయాలను నిశితంగా గమని స్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. రంగంలోకి దిగిపోయారు. తాజాగా ఆమె.. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో చర్చిస్తున్నారు. ఎవరెవరికి స్థానికంగా జరిగే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలి? ఎవరిని బుజ్జగించాలి? అనే విషయాలపై దృష్టి పెట్టారు. వాస్తవానికి మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ.. ఆమె వచ్చి.. పరిశీలించారు. వరుసగా భేటీలు నిర్వహించారు.
చివరకు ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో.. వారికే పదవులు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుం దని స్థానిక నాయకులు భావిస్తున్నారు. కానీ.. అంతర్గత కుమ్ములాటలను తగ్గించాలన్న ధ్యేయం ఒక్కటే కనిపిస్తోంది. అందుకే.. ఇంత చిన్న విషయాన్ని కూడా.. పెద్దదిగా భావిస్తున్నారన్న వాదన వినిపిస్తుం డడం గమనార్హం. మరోవైపు.. పార్టీ పరంగా బలంగానే ఉన్నా.. ఏ చిన్న తేడా వచ్చినా.. ఈ బలం, బలగానికి ప్రమాదం ఉందని అంచనా వేసుకుంటున్నారు. అందుకే.. ఏది వచ్చినా.. కాంగ్రెస్‌లో దిద్దుబాట్ల కోసం.. అధిష్టానం పెద్దగానే కసరత్తు చేస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
