స్టాలిన్ కటీఫ్...కాంగ్రెస్ కోల్పోయింది ఏంటి ?
ఇండియా కూటమిలోకి టీవీకే రావడం అనివార్యంగా మారింది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు కాంగ్రెస్ టీవీకేతోనే ఉంటున్నాయి.
By: Satya P | 9 May 2026 8:55 AM ISTఇండియా కూటమిలోకి టీవీకే రావడం అనివార్యంగా మారింది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు కాంగ్రెస్ టీవీకేతోనే ఉంటున్నాయి. విజయ్ కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. దాంతో నిన్నటి దాకా డీఎంకే కూటమితో ఉన్న పార్టీలు కాస్తా ఈ రోజున ఫ్లేట్ మార్చాయని అంటున్నారు. అయితే వామపక్షాలు స్టాలిన్ తో చర్చించిన మీదటనే తమ స్టాండ్ ప్రకటించాయి. అది కూడా బీజేపీ తమిళనాడులో అడుగు పెట్టకుండా చేసేందుకు లౌకిక వాద ప్రభుత్వం అని టీవీకేకి మద్దతు ఇచ్చాయి. ఏ మంత్రి పదవులకు ఆశ పడకుండా బయట నుంచి సపోర్టు చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్ వ్యవహార శైలి మాత్రం చాలా ఇబ్బందికరంగా డీఎంకేకి హర్ట్ చేసేలా ఉందని అంటున్నారు.
ఓడిన పార్టీ అంటూ :
కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ అయితే ఓడిన పార్టీతో ఉండమంటారా అంటూ ఓపెన్ గానే డీఎంకే మీద విమర్శలు చేశారు. అంతే కాదు సగానికి పైగా మంత్రులు ఓటమి పాలు అయ్యారని కూడా నిందించారు. ఇక టీవీకేకి మద్దతు ఇచ్చే విషయంలో దశాబ్దాల మిత్రుడు డీఎంకేతో ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరించారు. సరిగ్గా ఈ పరిణామాలే డీఎంకేకు ఎంతో ఆగ్రహం బాధ తెప్పించాయి. దాంతో ఆ పార్టీ నేతలు అయితే కష్ట కాలంలో ఇలా వ్యవహరిస్తారా అని కూడా మీడియా ముఖంగానే కాంగ్రెస్ నేతలను కడిగేశారు.
నమ్మకమైన మిత్రుడు :
డీఎంకే దశాబ్దాల పాటు కాంగ్రెస్ కి నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ వచ్చింది. శ్రీమతి ఇందిరా గాంధీ టైం నుంచి ఆనక రాజీవ్ గాంధీ జమానాలో ఇక సోనియా హయాం రాహుల్ గాంధీ టైం లోనూ డీఎంకే అదే స్నేహం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ లో నాలుగు తరాలు అలాగే డీఎంకేలో మూడు తరాలు ఈ స్నేహంతో ముందుకు సాగాయి. కానీ ఏమీ కాకుండా ఓడిన మొదటి గంటలోనే టీవీకే వెంటపడి డీఎంకేని దూరం పెట్టడంతో ఆ పార్టీ మండిపోతోంది. అందుకే లోక్ సభలో స్పీకర్ కి లేఖ రాసింది. తాము కాంగ్రెస్ పక్కన కూర్చోలేమని వేరుగా సీట్లు కేటాయించాలని కూడా అందులో కోరింది. దీంతో ఇండియా కూటమితో స్టాలిన్ కటీఫ్ చేసుకున్నారని అంటున్నారు.
విజయ్ చరిష్మాతో :
అయితే కాంగ్రెస్ ఆలోచిస్తున్నది చాలా ఉంది. విజయ్ చరిష్మా ఇపుడు తమిళనాడులో సూపర్ గా ఉంది దాంతో తమ ఓట్ల సీట్ల పంట పండించుకోవాలని చూస్తోంది. 2029 ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎక్కువగా తీసుకోవచ్చు అని కూడా భావిస్తోంది. అదే డీఎంకే అయితే ఇచ్చినన్ని సీట్లు పుచ్చుకోవాలి. టీవీకేతో అలా కాదు, కొత్త నేత కావడంతో తమ బేరాలు సాగుతాయని భావించి ఇలా చేశారు అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో నంబర్లు సక్సెస్ లేనా కొన్ని సార్లు అయినా బంధాల గురించి ఆలోచన ఉండదా అన్న చర్చ సాగుతోంది.
కామ్రేడ్స్ సైతం మండుతున్నారు :
అనుభవంలోనూ రాజకీయ అండలోనూ డీఎంకే సరిసాటి ఎవరు వస్తారు అని అంటున్నారు. ఇక కేరళం ఎన్నికల్లో వామపక్షాల మీద తీవ్ర విమర్శలు చేసి అధికారం కాంగ్రెస్ అందుకుంది. ఇపుడు తమిళనాడులో ఈ విధంగా చేసింది. ఇండియా కూటమి అంటేనే కామ్రేడ్స్ సైతం మండుతున్నారు. ఇవన్నీ చూసినపుడు 2029 ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్న చర్చ సాగుతోంది. ఒక కొత్త మిత్రుడి కోసం పాత మిత్రులను వదిలేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ కి డీఎంకే దూరం కావడం ముందు ముందు భారీ షాకులు ఇస్తుందని అంటున్నారు. డీఎంకే అన్నా డీఎంకే రెండూ ఎన్డీయేలో చెలిమి చేసినా లేక విజయ్ రాజకీయం తేడా కొట్టినా కాంగ్రెస్ కి తమిళనాడులోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఎటూ కాని స్థితి వస్తుందని అంటున్నారు.
