కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీకి దెబ్బ ?
ఇక సీజేపీ చేసిన పోరాటంలో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచే విద్యార్ధి యువత పాలు పంచుకున్నారని నివేదికలు తెలియచేసతున్నారు.
By: Satya P | 28 July 2026 9:14 AM ISTజాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జోడు సవారీతో హస్తం పార్టీలో స్పీడ్ కనిపిస్తోంది. దాంతో పాటు ఇటీవల విద్యార్థి ఉద్యమాలలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా పాల్గొని తమ పాత్ర ఏంటో జాతీయ స్థాయిలో చూపించింది. సీజేపీ అగ్నికి కాంగ్రెస్ వాయువుగా తోడు కావడంతోనే కేంద్రం దిగి వచ్చింది అన్నది నిఖార్సు అయిన రాజకీయ విశ్లేషణగా ఉంది. పార్లమెంట్ ని స్తంభింపచేసే కేవలం ఇదే ఇష్యూ మీద కేంద్రం ఫోకస్ పెట్టేలా చేయడమే కాదు వీధుల్లోకి వచ్చి మరీ రాహుల్ గాంధీ మోడీ సర్కార్ ని ఇరుకున పెట్టాల్సినంతగా పెట్టేశారు.
మూడేళ్ళకు ముందే :
ఇక దేశంలో చూస్తే వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్ళు ఇంకా చేతిలో అధికారం ఉండగానే వరసగా సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఉత్సాహం అంతా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా బ్లాక్ లో ఉంటే ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్ వంటి స్టేట్ ని గెలిచి బీహార్ లో తొలిసారి అధికారం చేపట్టినా బీజేపీ శిబిరంలో మాత్రం ఎంతో కొంత కలవరం రేగుతోంది. దానికి కారణం వివిధ వర్గాలలో పెరుగుతున్న అసంతృప్తి. అంతే కాదు దేశంలో ఎవరిని అయినా అధికారాంలోకి తీసుకుని రావాలీ అంటే పెద్ద సంఖ్యలో ఉన్న యువత మోడీ సర్కార్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇవన్నీ కాంగ్రెస్ లో జోష్ పెంచుతున్నాయి.
అగ్ని పరీక్ష అక్కడే :
ఇక ఈ ఏడాది వరకూ ఎన్నికలు అయితే లేవు కానీ 2027లో మాత్రం బీజేపీకి అగ్ని పరీక్ష అనదగిన ఎన్నికలు రెండు కీలక రాష్ట్రాలలో ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తర ప్రదేశ్ అయితే రెండవది గుజరాత్. ఈ రెండు స్టేట్స్ బీజేపీకి గుండె కాయ లాంటివి. అయితే గుజరాత్ మోడీ అమిత్ షాల సొంత రాష్ట్రం. పైగా మూడు దశాబ్దాలుగా అక్కడ కమలం పాగా వేసింది. ఈసారి ఎలా ఉంటుందో అన్న చర్చ సాగుతోంది. అలాగే 2027 నాటికి పదేళ్ళ బీజేపీ పాలన ఉత్తర ప్రదేశ్ లో పూర్తి అవుతుంది. అక్కడ 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని రెండో ప్లేస్ కి నెట్టేసి 37 ఎంపీ సీట్లను ఎస్పీ గెలుచుకుంది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో సవాల్ చేసేందుకు రెడీగా ఉంది. కాంగ్రెస్ సైతం బాగానే పుంజుకుంటోంది. మజ్లిస్ పార్టీ అఖిలేష్ కూటమిలో చేరబోతోంది. దాంతో ఇక్కడ బీజేపీకి కఠిన పరీక్ష అని అంటున్నారు.
ఉత్తరాది నుంచే యూత్ :
ఇక సీజేపీ చేసిన పోరాటంలో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచే విద్యార్ధి యువత పాలు పంచుకున్నారని నివేదికలు తెలియచేసతున్నారు. అందులో యూపీ బీహార్ గుజరాత్, రాజస్థాన్ పంజాబ్ వంటి చోట్ల నుంచి అధికంగా వచ్చారని చెబుతున్నారు. ఇక్కడ పంజాబ్ తప్ప తక్కినవి అన్నీ బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలే. మరి యువత ఆగ్రహం ఏంటో జంతర్ మంతర్ వద్ద అంతా చూశారు. వారి కేంద్ర మంత్రి రాజీనామాతో శాంతించినా బీజేపీ మీద అభిమానంగా ఉంటారని మునుపటి ఆదరణ చూపిస్తారు అని అనుకోవడం అత్యాశే అవుతుంది అని అంటున్నారు. వారు కనుక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అది కచ్చితంగా వచ్చే ఏడాది ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ అవుతుందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కానీ ఆ పార్టీ కూటమి కానీ గెలిస్తే దేశంలో కొత్త రాజకీయ గాలికి అంకురార్పణ జరిగినట్లే అని అంటున్నారు.
ఏపీలో సీన్ ఏంటి :
ఇక్కడే ఏపీ గురించి కూడా ఎక్కువగా చర్చ సాగుతోంది. దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటే దాని ప్రభావం ఎక్కువగా ఏపీ మీదనే ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడు విజయ్ ప్రభుత్వంలో భాగంగా ఉంది. దాంతో ఏపీలో కాంగ్రెస్ మళ్ళీ బలపడేందుకు చూస్తుంది. అది కచ్చితంగా వైసీపీకి దెబ్బ తీస్తుందని అంటున్నారు. వైసీపీలో ఉన్న పాత కాంగ్రెస్ నేతలు అంతా మళ్ళీ ఖద్దర్ పార్టీకి జై కొడితే మాత్రం వైసీపీ ఆ మేరేకు భారీ రాజకీయ నష్టాన్ని చూడొచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే 2029 కంటే ముందు 2027 నుంచే జాతీయ రాజకీయం ఏపీ రాజకీయంలో కూడా భారీ మార్పులు వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.
