పార్లమెంటు సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ లెక్క ఇదీ!
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభా లెక్కల ఆధారంగానే జరగాలని కాంగ్రెస్ కోరుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్న ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. సీట్ల పెంపు అంశంపై పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
By: Garuda Media | 29 Nov 2026 9:18 PM ISTపార్లమెంటు సీట్ల పెంపు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పార్టీ.. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. ఫలితంగా మరోసారి ఈ బిల్లు ప్రత్యేక సమావేశాల రూపంలో పార్లమెంటు ముందుకు వస్తోంది. అయితే.. అసలు కాంగ్రెస్ చెబుతున్న లెక్కలు ఏంటి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు సీట్ల పెంపును వ్యతిరేకిస్తోంది? అనేది అత్యంత కీలక అంశం. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం చెబుతున్న మాట కూడా వినాల్సిన అవసరం ఉంది. దానిలో ఏమేరకు లాజిక్ ఉందన్నది కూడా చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ చెబుతున్న విషయం ఏంటంటే.. 2026 జనాభా లెక్కలు తీసి.. ఆ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా పార్ల మెంటు నియోజకవర్గాలను విభజించాలని!. కానీ, దీనికి కాంగ్రెస్‌లోని మిత్రపక్షాలే అంగీకరించడం లేదు. మరోవైపు బీజేపీ దీనికి పూర్తి విరుద్ధంగా ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే.. అసలు వివాదం ఏంటంటే.. బీజేపీ సహా.. ఇతర పక్షాలన్నీ.. 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుని.. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలని కోరుకుంటున్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.
అయితే.. దీనిని కూడా.. దక్షిణాది రాష్ట్రాలు విభేదిస్తున్నాయి. కేంద్రం గతంలో ప్రవేశ పెట్టిన జనా భా నియంత్రణ మేరకు తమ తమ రాష్ట్రాల్లో జనాభాను నియంత్రించామని.. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా వద్దని.. 50 శాతం పెంపునకే మొగ్గు చూపుతామని అంటున్నాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం 2026 జనాభా లెక్కల ప్రకారం చేయాలని పట్టుబడుతోంది. ఇక్కడ ఆ పార్టీ ఎందుకు ఇలా పట్టుబడుతోందంటే.. 2010 సంవత్సరం తర్వాత.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జనాభా పెరిగిందని.. ఆ సంఖ్య ప్రకారం నియోజకవర్గాలను వర్గీకరించాలని కోరుతోంది.
దీనికి బీజేపీ సమ్మతించడం లేదు. సహజంగానే ఎస్సీ, ఎస్టీ సహా మైనారిటీ ఓటు బ్యాంకు బీజేపీకి తక్కువగానే ఉంది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న పలు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోలేదు. దీంతో ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటోంది. దీంతో రాజకీయ దుమారం రేగింది. ఇప్పుడు కూడా.. కాంగ్రెస్ అదే పట్టు పడుతోంది. 2026 జనాభా లెక్కల ప్రకారమే విభజన జరగాలని కోరుతోంది. కానీ, బీజేపీ అందుకు సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే రాష్ట్రాల వారీగా 50 శాతం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు ఇష్టపడే పార్టీలను మచ్చిక చేసుకుని ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తోంది. సో.. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అయితే నెరవేరేలా కనిపించడం లేదు. ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌తోనే ఉన్నారన్న ఆ పార్టీ అంచనాలు నిజమే అయినప్పటికీ.. ఈ మేరకు కేంద్రం చేసేందుకు సిద్ధంగా లేదు. అదే అసలు సమస్యగా మారిందని అంటున్నారు.
