కేరళ ముఖ్యమంత్రిగా శశిధరూర్...కాంగ్రెస్ ప్లానేంటి ?
దక్షిణాదిన కాంగ్రెస్ కి ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అవి తెలంగాణా, కర్నాటక. ఈ రెండింటితో పాటు కష్టపడితే మరో రాష్ట్రం హస్తగతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
By: Satya P | 22 March 2026 8:15 AM ISTదక్షిణాదిన కాంగ్రెస్ కి ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అవి తెలంగాణా, కర్నాటక. ఈ రెండింటితో పాటు కష్టపడితే మరో రాష్ట్రం హస్తగతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి రెండు విడతలుగా ఏకంగా పదేళ్ళ పాటు వామపక్షాల ఆధ్వర్యంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. దాంతో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దానిని పూర్తి స్థాయిలో అందుకునే అవకాశాలు అయితే కచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కే ఉన్నాయి. ఇక యూడీఎఫ్ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40 ప్లస్ ఎమ్మెల్యే సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. అధికారం అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 70 ప్లస్ కి చేరువ కావడం కాంగ్రెస్ కి సాధ్యమే అంటున్నారు.
సర్వేల అంచనా :
ఇక చూస్తే సర్వే అంచనాలు కూడా కాంగ్రెస్ కే కొంత ఎడ్జ్ ఉంటుందని చెబుతున్న నేపధ్యం ఉంది. ఇక 2024 ఎన్నికల్లో వయనాడ్ లో రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచారు. ఆయన ఆ సీటుకు రాజీనామా చేస్తే చెల్లెలు ప్రియాంకా గాంధీ గెలిచింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపించింది. అలా కాంగ్రెస్ బలం బాగానే ఉంది. దాంతో కాంగ్రెస్ ఈసారి గెలుస్తుంది అని కాంగ్రెస్ వాదులు అయితే నమ్మకంగానే ఉన్నారు దాంతో ముఖ్యమంత్రి పీఠం మీద అపుడే చాలా మంది కన్ను పడింది అని అంటున్నారు.
కీలక నేతగా :
ఇక కేరళకు చెందిన కీలక నేతగా చెప్పుకోవాలి అంటే జాతీయ స్థాయిలో తరచూ వినిపించే పేరు కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్. ఆయన తిరువంతపురం నుంచి లోక్ సభ నుంచి 2024 ఎన్నికల్లో గెలిచారు. ఆయన 2009 నుంచి వరసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్నారు. దాంతో పాటు ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి కూడా పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ లో పెద్ద తలకాయ గా ఉన్నారు. కాబట్టి ఆయనకు ఈ ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా అన్న చర్చ సాగుతోంది.
ఆసక్తి లేదంటూనే :
దీని మీద అయితే శశిధరూర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నాను కదా అని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి కదా అన్నారు. అయితే కేంద్ర పార్టీ తలచుకుంటే అదేమంత కష్తమైనది కాదని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం కేరళలో చేపడితే కనుక ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా సులువుగా గెలిచి రావచ్చు. అయితే శశిధరూర్ మాత్రం తనకు ఆ చాన్స్ లేదని ఎమ్మెల్యేలలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు అని అంటున్నారు.
కాంగ్రెస్ వ్యూహం :
మరో వైపు చూస్తే కేరళలో అగ్ర నేతగా ఉన్న శశిధరూర్ విషయంలో హై కమాండ్ చాలా విషయాల్లో కొంత గ్యాప్ పాటిస్తోంది అని అంటున్నారు. శశిధరూర్ తరచూ మోడీ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. దాంతో కాంగ్రెస్ అగ్ర నేతలకు కొంత చికాకుగా ఉంటోంది. లేటెస్ట్ గా చూస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పశ్చిమాసియా యుద్ధం నేపధ్యంలో సంయమనంతో పాటిస్తోందని శశిధరూర్ కితాబు ఇచ్చారు. ఇది సైలెన్స్ ఏ మాత్రం కాదని దౌత్య వ్యూహం కరెక్ట్ గానే ఉంది అని ఆయన అంటున్నారు. ఇది కూడా కాంగ్రెస్ స్టాండ్ కి కొంత భిన్నమైన తీరుగానే అంతా చూస్తున్నారు.
మేధావిగా ఒక మంచి అభిప్రాయం :
మరో వైపు చూస్తే ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతర్పురం కార్పోరేషన్ బీజేపీ చేతిలోకి వెళ్ళింది. అంటే స్థానిక ఎంపీగా శశిధరూర్ వైఫల్యంగానే దానిని కాంగ్రెస్ పెద్దలు చూస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే శశిధరూర్ కి మేధావిగా ఒక మంచి అభిప్రాయం ఉంది కానీ ఆయనను సీఎం గా చేస్తే ఉదారత కానీ వ్యూహం కానీ కాంగ్రెస్ కి లేవనే అంటున్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలలో ఒక సీనియర్ ని తెచ్చి సీఎం ని చేయడమే కాంగ్రెస్ ఆలోచన అని అంటున్నారు. ఇవన్నీ తెలిసే శశిధరూర్ కూడా తనకు చాన్స్ ఎక్కడ ఉంది అని సింపుల్ గా చెప్పేశారు.
