Begin typing your search above and press return to search.

'టైం' కోసం వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ..!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విషయంపై పార్టీలో ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పుంజుకోవాలంటే రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రజల మధ్య ఉండాలని ఒక వర్గం నాయకులు చెబుతున్నారు.

By:  Garuda Media   |   30 July 2025 7:00 PM IST
టైం కోసం వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ..!
X

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విషయంపై పార్టీలో ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పుంజుకోవాలంటే రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రజల మధ్య ఉండాలని ఒక వర్గం నాయకులు చెబుతున్నారు. మరో వర్గం నాయకులు సీనియర్లకు విలువ ఇచ్చి, వారి సూచనలు, సలహాలను పాటించడం ద్వారా పార్టీ పుంజుకునేలా చేయాలని సూచిస్తున్నారు. అయితే, ఈ రెండు విషయాలను కూడా షర్మిల పట్టించుకోవడం లేదన్నది అంతర్గతంగా జరుగుతున్న చర్చ. సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారన్న వాదన ఎప్పటి నుంచో ఉన్నది.

అయితే ఇటీవల కాలంలో కొంత మార్పు అయితే కనిపిస్తున్నా.. ఆశించిన విధంగా మాత్రం షర్మిల రాజకీయాలను ముందుకు తీసుకు వెళ్ళలేకపోతున్నారన్నది స్పష్టమవుతుంది. ప్రధానంగా ప్ర‌జ‌ల‌ను క‌ల‌వడానికి, స్థానిక సంస్థల ఎన్నికలలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించడానికి.. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని పుంజుకునేలా చేయాలన్నది చాలామంది నాయకులు పెట్టుకున్న ఆశ. తద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను తిరిగి బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకునేలాగా వ్యవహరించాల‌ని చెబుతున్నారు.

కానీ, షర్మిల వ్యూహం ఎలా ఉన్నప్పటికీ పార్టీ పరంగా కూడా ఈ తరహా ఆలోచనలు ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ కూడా జగన్ను టార్గెట్ చేయడం ద్వారా మాత్రమే పార్టీ పుంజుకుంటుంది.. అన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. తరచుగా ఆయన జగన్ను తీవ్రస్థాయిలో విమర్శలు ఇస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభ‌కోణంలో కేవలం డబ్బులు మాత్రమే కాదని, ప్రజల ఆరోగ్యం విషయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని ఎంత మంది చనిపోయారు ఎంతమంది రోగాల బారిన పడ్డారు అనే విషయాలను కూడా వెలికి తీసి కేసులు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

సో దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం స్థానికంగా ఒక రకంగా ఉంటే.. జాతీయస్థాయి నాయకులు, మరో విధంగా ఆలోచన చేస్తుండడంతో అసలు ఈ పార్టీ పుంజుకుంటుందా .. అసలు భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తద్వారా ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా సరైన దిశా నిర్దేశం లేక పార్టీ మారెందుకు ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వీరంతా స‌మ‌యం కోసం వేచి చూస్తున్నార‌ని.. కుదిరితే పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.