Begin typing your search above and press return to search.

'ఈవీఎంలు' త‌నిఖీ.. మ‌రో రాజ‌కీయ వివాదం!

2027లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియలో తమ ప్రతినిధులను అనుమతించాలని కాంగ్రెస్, ఆప్ కోరాయి. అయితే ఇది సాధారణ అధికారిక ప్రక్రియేనని, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని ఈసీ స్పష్టం చేసింది.

By:  Garuda Media   |   10 Nov 2026 5:00 AM IST
ఈవీఎంలు త‌నిఖీ.. మ‌రో రాజ‌కీయ వివాదం!
X

ఈవీఎంల‌పై ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం గ‌త 20 ఏళ్లుగా దేశంలో జ‌రుగుతోంది. వీటి ద్వారా త్వ‌ర‌గాఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తికావ‌డంతోపాటు.. ఖ‌ర్చు కూడా కోట్ల రూపాయ‌ల్లో త‌గ్గుతోంద‌ని ప్ర‌భుత్వాలు కూడా చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా..ఈ వీఎంల‌పైనే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే.. తాజాగా మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రో నాలుగు నెల్ల‌లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఈవీఎంల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించింది. ఇదే ఇప్పుడు దేశంలో కొత్త వివాదానికి దారి తీసింది.

విష‌యం ఏంటి?

వ‌చ్చే ఏడాది దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఆయా ఎన్నిక‌ల‌'పై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. ప్రారంభిం చింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2027 జనవరి ప్రథమ లేదా ద్వితీయా ర్థంలో ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం.కూడా ఉంది. మొత్తం ప్ర‌క్రియ‌ను 2027 ఫిబ్రవరి, మార్చిలో ప్రక్రియ పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ 5 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియను కూడా ఇటీవ‌ల పూర్తి చేసింది. అదేస‌య‌మంలో ఈవీఎంల‌ను తనిఖీ చేయాల‌ని ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల అధికారుల‌ను ఆదేశించింది.

అయితే.. ఈవీఎంల త‌న‌ఖీలు ఇప్పుడే ఎందుకు చేప‌డుతున్నార‌న్న‌ది కాంగ్రెస్ స‌హా.. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిలో ఏదో లోపాయికారీ ఒప్పందం ఉంద‌ని మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఒక‌వేళ ఈవీఎంల‌ను త‌నిఖీలు చేయాల‌ని అనుకుంటే.. త‌మ‌ను కూడా పిల‌వాల‌ని.. రాజ‌కీయ పార్టీలు ఎంపిక చేసిన ప్ర‌తినిధుల స‌మ‌క్షంలోనే వాటిని త‌నిఖీ చేయాల‌ని కోరారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ఇదే డిమాండ్‌ను తెర‌మీదికి తెచ్చింది. ఈవీఎంల‌ను త‌నిఖీ చేసేప్పుడు.. త‌మ వారిని పంపిస్తామ‌ని.. త‌మ స‌మ‌క్షంలోనే వాటిని త‌నిఖీ చేయాల‌ని కోరింది.

నిరాక‌ర‌ణ‌..

అయితే..ఈ డిమాండ్ల‌ను ఎన్నిక‌ల సంఘం తోసిపుచ్చింది. ఇది పూర్తిగా అధికారిక ప్ర‌క్రియ అని.. దీనికి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌ని పేర్కొంది. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. రెండు మాసాల ముందే అన్నీ స‌రిగా ఉన్నాయో లేవోన‌ని త‌నిఖీ చేస్తామ‌ని తెలిపింది. దీనిని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ప్ర‌తి విష‌యాన్నీ అనుమాన‌పు ద్రుక్కోణంలో చూడ‌డం కూడా స‌రికాద‌ని హిత‌వు ప‌లికింది. త‌మ‌కు ప్ర‌జ‌లే ముఖ్య‌మ‌ని.. పేర్కొంది. ఇక‌, స‌ర్ ప్ర‌క్రియ పూర్త‌యిన రాష్ట్రాల్లో జ‌న‌వ‌రి వ‌ర‌కుకొత్త‌గా ఓటు హ‌క్కు పొందేందుకు అవ‌కాశం క‌ల్పించామ‌ని తెలిపింది. అయితే.. ఈసీ వాద‌న‌ను కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది. ఒక పార్టీకి మేలు చేసేందుకు ఈవీఎంల‌ను ఇప్ప‌టి నుంచే సిద్ధం చేస్తున్నారా? అని పార్టీ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్‌మండిప‌డ్డారు.