కండోమ్స్ కావలెను.. పరుగులు పెట్టిన ఒలిపింక్స్ నిర్వాహకులు
ఔను.. మీరు చదివింది నిజమే. సురక్షిత శృంగారం కోసం వినియోగించే కండోమ్‌ల కొరత కారణంగా ఇటలీలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్ క్రీడలకు తీవ్రవిఘాతం ఏర్పడింది.
By: Garuda Media | 13 Feb 2026 11:00 PM ISTఔను.. మీరు చదివింది నిజమే. సురక్షిత శృంగారం కోసం వినియోగించే కండోమ్‌ల కొరత కారణంగా ఇటలీలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్ క్రీడలకు తీవ్రవిఘాతం ఏర్పడింది. దీంతో ఒలింపిక్ నిర్వాహ కులు ఉరుకులు పరుగులు మీద కండోమ్స్ తెప్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ క్రీడల్లో సాధారణ కండోమ్స్ వినియోగించేందుకు అనుమతించరు. పక్కా నాణ్యమైన, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కండోమ్స్‌నే వినియోగించాలి. దీంతో అలాంటి వాటికోసం టెండర్లను పిలిచారు.
ఏం జరిగింది...?
2026-వింటర్ ఒలింపిక్స్.. ఇటలీలో జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 22 వేల మంది అథెట్లు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే.. ఈ క్రీడలు పూర్తయ్యే సరికి.. కనీసం 22 రోజులు పడుతుంది. దీంతో నిర్వాహకులు.. ఈ ఈవెంట్‌లో పాల్గొనే క్రీడాకారుల సౌకర్యం కోసం కండోమ్స్‌ను పంపిణీ చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. సురక్షిత శృంగారం నేపథ్యంలో వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఈ ఏడాది ఈ నెల 6న ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజే.. క్రీడాకారులకు 10 వేల కు పైగా కండో మ్స్‌ను పంపిణీ చేశారు. అయితే.. వారం తిరిగే సరికే.. అవి అయిపోయాయి. ఈ విషయం తెలియడంతో ఒలింపిక్ నిర్వాహకులు ఆందోళన చెందారు. 10వేలకుపైగా కండోమ్స్ ప్యాకెట్లను సరఫరా చేయగా.. కేవలం కొద్ది రోజుల్లోనే అయిపోవడంతో ఏం చేయాలా? అని తలపట్టుకున్నారు. ఎందుకంటే.. ఇక తమ వద్ద స్టాక్ లేదు. పోనీ.. కొత్తవి తీసుకుందామంటే.. నిబంధనల ప్రకారం కండోమ్స్ ఉండాలి.
దీంతో హుటాహుటిన.. 20 వేల కండోమ్స్‌కు కాంట్రాక్టు పిలిచి.. ఖరీదు చేయాలని నిర్ణయించారు. అయితే.. తమ వద్ద అప్పటికప్పుడు 5 వేల కండోమ్స్ మాత్రమే ఉన్నాయని కంపెనీలు చెప్పడంతో మరిన్ని కొను గోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒలింపిక్స్ సహా.. సుదీర్ఘకాలం కొనసాగే క్రీడల సమయంలో ఈవెంట్ నిర్వాహకులు క్రీడాకారులకు(మహిళలకు కూడా) కండోమ్స్ పంపిణీ చేస్తారు. తాజా లోటుపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కండోమ్స్ అందే వరకు.. మహిళా క్రీడాకారులు, పురుష క్రీడాకారులను వేర్వేరుగా ఉంచాలని వింటర్ ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది.
