Begin typing your search above and press return to search.

కాగ్నిజెంట్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోం... ల్యాప్‌టాప్‌లతో నిఘా

కరోనా కారణంగా చాలా కంపెనీలు ఆ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశంను తమ ఉద్యోగస్తులకు ఇచ్చిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   19 Nov 2025 2:00 AM IST
కాగ్నిజెంట్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోం... ల్యాప్‌టాప్‌లతో నిఘా
X

కరోనా కారణంగా చాలా కంపెనీలు ఆ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశంను తమ ఉద్యోగస్తులకు ఇచ్చిన విషయం తెల్సిందే. చాలా కంపెనీలు అదే వర్క్‌ ఫ్రమ్‌ హోం ను కొనసాగిస్తూ ఉంటే కొన్ని కంపెనీలు మాత్రం వర్క్‌ ఫ్రమ్‌ హోం ను రద్దు చేసి ఆఫీస్‌లకు తమ ఉద్యోగులను వెనక్కి పిలిచింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్ల కంపెనీలకు కోట్లల్లో ఖర్చు తగ్గుతుంది, అంతే కాకుండా ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు కష్టం తప్పుతుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన సమస్యలు పూర్తిగా తగ్గాయి. గతంలో కొన్ని కంపెనీలు నెలకు లక్షల్లో ట్రాన్స్‌పోర్ట్‌ కోసం ఖర్చు చేసేవి, కానీ ఇప్పుడు ఆ ఖర్చు తప్పిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇస్తున్న కంపెనీలు తమ ఉద్యోగస్తుల పని తీరు పట్ల కాస్త అసహనంతో ఉన్న మాట మాత్రం వాస్తవం.

కాగ్నిజెంట్‌ లో వర్క్‌ఫ్రమ్‌ హోం...

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లో ఉన్న ఉద్యోగస్తులు చాలా మంది వర్కింగ్‌ అవర్స్‌ లో వేరే పని చేసుకుంటూ ఉన్నారు. కొందరు లాగిన్‌ అయ్యి, వర్క్ చేయకుండా ఉండి లాగౌట్ అయ్యే వరకు పెద్దగా పని చేయరు అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ వర్కింగ్‌ టైంలో అందుబాటులో లేని ఉద్యోగస్తుల విషయంలో కంపెనీలు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అయిన కాగ్నిజెంట్‌ ఇకపై వర్క్‌ ఫ్రమ్‌ హోం లో ఉన్న ఉద్యోగస్తులపై నిఘా ఉంచబోతుంది. అయిదు నిమిషాలు మౌస్ పట్టుకోకుంటే వెంటనే వారు వర్క్‌ చేయనట్లుగా గుర్తించబోతున్నారు. అందుకోసం కంపెనీ లాప్‌టాప్‌ లో కొత్త ఫీచర్‌ని తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగస్తులు వర్క్ చేసే విధానం, వారు స్క్రీన్‌ ముందు ఉన్న సమయం అన్నింటిని కూడా లెక్కించే విధంగా ఒక సాఫ్ట్‌వేర్‌ ను రూపొందించారని తెలుస్తోంది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొత్త నిబంధనలు..

ల్యాప్‌టాప్‌ ముందు ఉన్న ఉద్యోగి అయిదు నిమిషాల పాటు, కీ బోర్డ్‌ కానీ, మౌస్ పై కానీ ఏమీ పని చేయనట్లుగా రిజిస్టర్ అయితే వెంటనే కంపెనీకి సందేశం వెళ్తుంది. అలా వెళ్తే వెంటనే హెచ్‌ ఆర్‌ డిపార్ట్‌ మెంట్‌ నుంచి కాల్‌ వస్తుందట. ఇలా మొత్తానికి కాగ్నిజెంట్‌ కంపెనీ లో వర్క్ చేస్తున్న వర్క్‌ ఫ్రమ్‌ హోం ఎప్లాయిస్‌ పై నిఘా పెట్టబోతున్నారు. ఈ నిఘా వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. ఈ మధ్య కాలంలో కంపెనీలు తమ ఉద్యోగస్తులపై ఒత్తిడి లేకుండా చేస్తూ ఉంటే, ఈ కంపెనీ మాత్రం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందని, ఇది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని, అయిదు పది నిమిషాలు బ్రేక్‌ తీసుకుని చేయడం అనేది వర్క్‌ ఫ్రమ్‌ హోం వారికి ఉన్న వెసులుబాటు అవుతుంది. అయితే వారికి ఇచ్చిన టాస్క్ పూర్తి అయిందా లేదా అనేది చూసుకోవాలి, కానీ ఇలా టార్గెట్‌ పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌ అనేది చాలా మంది ప్రశ్న.

ఆన్ లైన్‌ లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ...

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అంటేనే చాలా మెంటల్‌ ప్రెజర్‌ ఉంటుంది, ఇప్పుడు వర్క్‌ ఫ్రమ్‌ హోం వారిపై నిఘా పెట్టడం వల్ల మరింతగా వారిపై ప్రెజర్‌ ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. దేశంలో అత్యధికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాగ్నిజెంట్‌ లో వర్క్‌ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీకి చెందిన మెజార్టీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి వీరు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ ఇష్యూ ఉంటుంది, కొన్ని చోట్ల పవర్‌ ఇష్యూ ఉంటుంది. అయినా కూడా తమకు ఆన్‌ లైన్‌ లో ఉండాల్సిందే అంటూ కంపెనీ రూల్‌ తీసుకు రావడం అనేది ఏమాత్రం కరెక్ట్‌ కాదు. వారి పనితీరుపై శ్రద్ధ పెట్టడం, నిఘా పెట్టడం పర్వాలేదు కానీ, వారు కనీసం అయిదు నిమిషాలు కూడా బ్రేక్‌ తీసుకోకూడదు అంటూ నిఘా పెట్టడం సరైన పద్దతి కాదని చాలా మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.