Begin typing your search above and press return to search.

బొద్దింక‌ల్లో చీలిక సంచ‌ల‌నం.. ఏం జ‌రిగింది?

ఇది తాజాగా రెండుగా విడిపోయింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ-డెమొక్ర‌టిక్‌(డీ)గా రెండుగా చీలిపోయింది. ఈ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ-డీకి.. మ‌నీష్ బ్ర‌హ్మ‌భ‌ట్ నేతృత్వం వ‌హించ‌నున్నారు.

By:  Garuda Media   |   6 Sept 2026 8:51 AM IST
బొద్దింక‌ల్లో చీలిక సంచ‌ల‌నం.. ఏం జ‌రిగింది?
X

కాక్రోచ్(బొద్దింక‌) జ‌న‌తా పార్టీ పేరుతో ఉద్య‌మ పార్టీని స్థాపించి.. వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష ప్ర‌శ్న ప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారంపై దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మించిన పార్టీలో చీలిక వ‌చ్చింది. ఇది తాజాగా రెండుగా విడిపోయింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ-డెమొక్ర‌టిక్‌(డీ)గా రెండుగా చీలిపోయింది. ఈ కాక్రోచ్ జ‌న‌తాపార్టీ-డీకి.. మ‌నీష్ బ్ర‌హ్మ‌భ‌ట్ నేతృత్వం వ‌హించ‌నున్నారు.

ఏం జ‌రిగింది?

విద్యార్థుల‌ను ముఖ్యంగా జెన్‌జీని ఐక్యంగా ముందుకు తీసుకురావ‌డంలో ఇటీవ‌ల కాలంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలోనే కేంద్ర స‌ర్కారుపై వ‌త్తిడి పెంచి.. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కువిశ్ర‌మించ‌కుండా పోరు స‌ల్పింది. దేశ‌వ్యాప్తంగా ఒక ఉద్య‌మ పార్టీకి అన‌తి కాలంలో గుర్తింపు తీసుకువ‌చ్చిన పార్టీగా కూడా.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ-డీ గుర్తింపు ద‌క్కించుకుంది. అయితే.. ఆది నుంచి కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి.. ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ రాజ‌కీయ పార్టీకి మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంద‌న్న చ‌ర్చ ఉంది.

ఆప్ క‌న్వీన‌ర్‌.. అర‌వింద్ కేజ్రీవాల్ సూచ‌న‌ల మేర‌కు.. కాక్రోచ్ జ‌న‌తాపార్టీ క‌న్వీన‌ర్‌.. అభిజిత్ దీప్కే వ్య‌వహరిస్తున్నార‌న్న వాద‌న కూడా వినిపించింది. గ‌తంలో దీప్కే ఆప్‌లో ప‌నిచేసి ఉండ‌డం.. మ‌నీష్ శిశోడియా వంటి అగ్ర‌నేత‌ల‌తో ఆయ‌న‌కు సాన్నిహిత్యం ఉండ‌డంతో కాక్రోచ్ జ‌న‌తా పార్టీపై ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు పెరిగాయి. ఇక‌, తాజాగా బ్ర‌హ్మ‌భ‌ట్ తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. త‌మ‌దే అస‌లు సిస‌లు ఉద్య‌మ పార్టీ అని ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు.

జాతీయ జ‌ట్టుతో విభేదాలు..

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఇటీవల జాతీయ స్థాయి నాయ‌క‌త్వాన్ని ఎంపిక చేసింది.దీనిలో బ్ర‌హ్మ‌భ‌ట్‌కు అవకా శం ద‌క్క‌లేదు. ఇదే తీవ్ర వివాదానికి దారి తీసి.. ఆయ‌న విడిపోవ‌డానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు. దీంతో త‌మ‌దే అస‌లు ఉద్య‌మ పార్టీ అని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కాక్రోచ్‌జ‌న‌తాపార్టీని అమ్మేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ-డీ మాత్ర‌మే ఉద్య‌మ పార్టీగా కొన‌సాగుతుంద‌న్నారు. కాగా.. ఈ వ్య‌వ‌హారంపై అభిజిత్ దీప్కే మౌనం పాటించారు. త‌మ‌లో కొంద‌రు శ‌త్రువులు ప్ర‌వేశించారంటూ.. కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యం గ‌మ‌నార్హం.