కాక్రోచ్ పార్టీ ఫౌండర్ కులమేంటి...నెటిజన్ కి షాక్ !
దేశంలో కొత్త పార్టీ పుట్టుకుని వచ్చింది. దాని వయసు అక్షరాలా ఆరు రోజులు. కానీ అది ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న బీజేపీని మించి పోయింది.
By: Satya P | 22 May 2026 12:53 PM ISTదేశంలో కొత్త పార్టీ పుట్టుకుని వచ్చింది. దాని వయసు అక్షరాలా ఆరు రోజులు. కానీ అది ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న బీజేపీని మించి పోయింది. ఇపుడు ఇండియా యూత్ వాయిస్ గా మారింది. అణగారిన వర్గాలకు ఆలంబనగానూ అవుతోంది. ఇంతకీ ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. ఎస్ సీజేపీ. బీజేపీకి పోటీగా పుట్టుకొచ్చిన పార్టీ అన్న మాట. మరి దీని ఫౌండర్ ఎవరు అంటే అభిజీత్. ఆయన ప్రవాసంలో ఉండి సోషల్ మీడియా ఖాతా ద్వారా పార్టీని నడిపిస్తున్నారు. దెబ్బకు రికార్డులు అన్నీ బద్ధలు అవుతూ ఫాలోవర్స్ ని కాక్రోచ్ పార్టీ సొంతం చేసుకుంది.
దళితుల సమస్యలు :
భారత్ లో దళితులు మైనారిటీలు ఇతర అణగారిన వర్గాల సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి మీద పోరాడాలని అంతా కోరుకుంటారు. మరి కాక్రోచ్ పార్టీ అయితే దళితుల సమస్యల గురించి చర్చించదా ఇంతకీ ఫౌండర్ కులమేంటి ఇలా నెటిజన్ల సెర్చింగ్ మొదలైంది. కొందరు నెటిజన్లు అయితే కాక్రోచ్ పార్టీ ఫౌండర్ మీద ప్రశంసలు కురిపిస్తూంటే మరి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో రిజర్వేషన్లు దళితుల సమస్యల మీద ఎందుకు కాక్రోచ్ పార్టీ ఫౌండర్ ప్రస్తావించడం లేదు అన్న ఒక నెటిజన్ ప్రశ్నకు అభిజిత్ షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. ఎస్ నేను దళితుడినే. మీ ప్రశ్నకు ఇదే నా జవాబు అని సంచలన కామెంట్స్ చేశారు. నా నుంచి సరైన సమాధానం లభించింది అనుకుంటాను అని కూడా అన్నాడు.
జైలులో వేస్తారు అంటూ :
తాను భారతదేశం వస్తే కనుక తనను జైలులో వేస్తారు అని అభిజిత్ చెప్పడమూ విశేషం. అందుకే ప్రవాసంలో ఉండే పోరాడుతున్నాను అని చెబుతున్నాడు. ఇదిలా ఉంటే రిజర్వేషన్లకు అభిజిత్ సపోర్ట్ చేస్తున్నరా లేక మెరిట్ సిస్టం కి వ్యతిరేకమా ఇలా ఆయన మీద అనేక రకాలుగా ట్రోల్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి వాటి మీద అభిజిత్ స్పష్టత ఏమిటి అన్నది తెలియడం లేదు కానీ తన కులమేంటో చెప్పి మరీ నెటిజన్లకు షాక్ ఇచ్చాడు. అంతే కాదు ఇండియన్ సిస్టం లో పొలిటికల్ ఫీల్డ్ లో కొన్ని వర్గాల సమస్యలకు ఉన్న డిమాండ్ వాటి విషయంలో ఎలుగెత్తుతున్న గొంతుకలు వాటికి మద్దతు వంటి వాటి విషయంలో అభిజిత్ ఇంకా డెసిషన్ కి వచ్చినట్లుగా లేరని విశ్లేషణలు ఉన్నాయి. అయితే తాను దళితుడిని అని చెబుతూ మీ ప్రశ్నలకు జవాబు వచ్చింది అని అభిజిత్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ తో మాత్రం సీజేపీ ఏర్పాటు వెనక ప్రభంజనం వెనక చాలా మ్యాజిక్ ఉందని అర్ధం అవుతోంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. సీజేపీ ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రకంపనలు ముందు ముందు సృష్టిస్తుందో.
