దేశమంతా కాక్రోచ్...రాష్ట్రాల్లోనూ సీజేపీ !
ఆరు నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను విస్తరిస్తోంది. నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలతో గుర్తింపు పొందిన ఈ సంస్థ తాజాగా 10 రాష్ట్రాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లో 16 మంది, మహారాష్ట్రలో 15 మందితో కమిటీలు నియమించింది. జెన్ జీ యువతను అనుసంధానిస్తూ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
By: Satya P | 16 Nov 2026 9:58 AM ISTకాక్రోచ్ జనతా పార్టీ తన బలాన్ని దేశమంతా విస్తరించుకోవాలని చూస్తోంది. సరిగ్గా ఆరు నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించిన సీజేపీ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ మీద భారీ ఎత్తున ఆందోళనను చేపట్టి అందులో సక్సెస్ అయింది. దేశ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీజేపీ దెబ్బకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక తాజాగా జంతర్ మంతర్ వద్ద సీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళన చేయాలని చూసింది. ఆ సమయంలో ఢిల్లీ అంతా దిగ్బంధం చేయాల్సి వచ్చిందంటే సీజేపీ పరోక్షంగా అలా సక్సెస్ అయింది అని అంటున్నారు.
విస్తరించే వ్యూహం :
సీజేపీని దేశంలో పలు రాష్ట్రాలలో విస్తరించాలని చూస్తోంది. ఈ క్రమంలో తాజాగా పది రాష్ట్రాలలో ఇంచార్జిలను నియమించడం జరిగింది. అంతే కాదు దేశంలో జోనల్ ఇన్ఛార్జులను కూడా నియమించింది. అదే విధంగా పశ్చిమ జోన్ ఇన్ఛార్జిగా క్షితిజ్ పగార్, ఉత్తర జోన్ ఇన్ఛార్జిగా డాక్టర్ వివేక్ సంగ్వాన్ నియమితులయ్యారు. ఉత్తర జోన్ సమన్వయ కమిటీలో మహమ్మద్ జునైద్, గీగ్రాజ్ జోర్లీలకు సభ్యులుగా నియమితులు అయ్యారు. అదే సమయంలో 10 రాష్ట్రాలు కీలక ప్రాంతాల్లో కొత్త సమన్వయ కమిటీలను కూడా సీజేపీ ఏర్పాటు చేసింది.
నెట్ వర్క్ బలోపేతం :
సీజేపీ దేశంలోని జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హర్యానా, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్లలో సమన్వయ కమిటీలను తాజాగా ఏర్పాటు చేసింది. దాంతో ఈ రాష్ట్రాలలో సీజేపీ కార్యకలాపాలను ఎప్పటికపుడు కో ఆర్డినేట్ చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో తమ నెట్వర్క్ను పెద్ద ఎత్తున విస్తరించడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యమని సీజేపీ పేర్కొంటోంది. ఇక ఇలా నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో సభ్యుల సంఖ్యను కూడా సీజేపీ ప్రకటించింది.
యూపీలోనే ఎక్కువగా :
ఇక దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 16 మందితో సీజేపీ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే మహారాష్ట్రలో 15 మందితో, జార్ఖండ్లో 14 మందితో, ఈశాన్య ప్రాంతంలో 14 మందితో, బిహార్లో 13 మందితో, పశ్చిమ బెంగాల్లో 12 మందితో ఈ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అలాగే హర్యానాలో ఆరుగురు, రాజస్థాన్లో ఐదుగురు, ఉత్తరాఖండ్లో ఆరుగురు, జమ్మూ కశ్మీర్లో నలుగురు సభ్యులతో సీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది.
జెన్ జీతో అనుసంధానం :
ఇక చూస్తే సీజేపీని అభిజీత్ దీప్కే స్థాపించారు. కేవలం ఢిల్లీ స్థాయిలో పోరాటాలే కాకుండా దేశమంతా విస్తరించడం ద్వారా సీజేపీని పటిష్టం చేయాలని ఆయన సంకల్పించారు అని అంటున్నారు. నెట్ వర్క్ గట్టిగా ఉంటే జెన్ జీ తో ప్రాంతీయంగానూ గ్రౌండ్ లెవెల్ లో నూ అనుసంధానం మరింతగా సాగుతుందని దాంతో దేశంలో యూత్ ని తమ వైపునకు తిప్పుకుంటే భవిష్యత్తు ఉద్యమాలకు కానీ ప్రజా పోరాటాలకు కానీ అది అన్ని విధాలుగా కలిసి వస్తుందని ఆలోచనతోనే సీజేపీ ఈ విస్తరణకు పూనుకుంది అని అంటున్నారు. రాజకీయ వేదికగా సీజేపీ లేదని ప్రస్తుతానికి అభిజిత్ దీప్కే చెబుతున్నప్పటికీ ఈ కమిటీలూ విస్తరణ అన్నది చూస్తూంటే భవిష్యత్తులో సీజేపీ అడుగులు ఎటు పడతాయి అన్న చర్చ అయితే సాగుతోంది.
