నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?
ప్రపంచ చరిత్ర చూస్తే నియంతలు ప్రజలను పీడించారు.. పక్కదేశాలపైకి యుద్ధాలకు వెళ్లారు.
By: A.N.Kumar | 4 Nov 2026 6:27 PM ISTప్రపంచ చరిత్ర చూస్తే నియంతలు ప్రజలను పీడించారు.. పక్కదేశాలపైకి యుద్ధాలకు వెళ్లారు. అక్కడి ప్రజల ఉసురు తీశారు. చివరకు నియంతలపై తిరుగుబాటుతో .. అన్ని దేశాలు ఏకమై వీరికి చరమగీతం పాడాయి.. నియంతల అంతం భీతావాహంగానే సాగింది. ఇప్పుడే ఇదే చరిత్రను కాక్రోచ్ జనతా పార్టీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. దానికి రెండు కారణాలున్నాయి..
ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో యుద్ధోన్మాద ప్రధానులు, అధ్యక్షుడికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారు. వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ముందుగా ప్రపంచంలోనే అత్యంత యుద్ధోన్మాద ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు ఇజ్రాయెల్ ప్రజలు మెజార్టీ ఇవ్వకుండా హంగ్ ను ఆ దేశంలో ఏర్పరిచారు. ఇక అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో యుద్ధాలు, ఆంక్షలు, వీసాలు, సహా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ట్రంప్ కు సొంత ప్రజలే చెక్ పెట్టి ఓడించారు.
ప్రపంచ దేశాల్లో తాము చెప్పిందే వినాలని.. తాము చేసిందే యుద్ధమంటూ ముందుకెళ్లిన ట్రంప్, నెతన్యాహులకు తగిలిన ఈ ఎదురుదెబ్బలను హైలెట్ చేసింది కాక్రోజ్ జనతా పార్టీ. ఆ పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ చేసిన వేర్వేరు ట్వీట్లు వైరల్ అయ్యాయి.
2010 తర్వాత ప్రపంచంలో నియంతలు వచ్చారని.. నియంతృత్వం పెరిగి ప్రజాస్వామ్యం పురోగమించిందని సీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. అయితే వారు సంస్థల కన్నా తామే గొప్పవారమంటూ విర్రవీగుతూ ప్రపంచంపై ఆధిపత్యాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థల పతనం.. హక్కుల అణిచివేత, యుద్ధాలు, ఆర్థిక అస్థిరత చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోందని సీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. బలవంతుడని చెప్పుకునే వ్యక్తుల చేతుల్లో అధికారంతో దేశం బలపడదని ప్రజలు గ్రహించి ఇప్పుడు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
నిరంకుశ ధోరణితో ముందుకెళ్లిన ట్రంప్ అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో పట్టుకోల్పోయారు. ఇక నెతన్యాహుకు మెజార్టీ రాక ప్రధాని పదవికి దూరమయ్యారు. దీంతో సీజేపీ నేతలు పరోక్షంగా మోడీ టార్గెట్ గానే ఈ ట్వీట్లు చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ట్రంప్, నెతన్యాహులాగానే మోడీకి జరుగుతుందా? సీజేపీ నేతల కోరిక నెరవేరుతుందా? అన్నది వేచిచూడాలి.
